నా పేరే నాకు చిరునామా
తమిళసినిమా: కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న నటి నయనతార. అంతేకాకుండా అత్యధిక పారితోషికం పొందుతున్న దక్షిణాది కథానాయకి ఈ భామనే. తొలి రోజుల్లో అవకాశాల కోసం కాళ్లకు బలపాలు కట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈమె ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్నారు. అంతేకాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార వాణిజ్య ప్రకటనల ద్వారాను సంపాదిస్తున్నారు. ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. లేడీస్ సూపర్ స్టార్ పట్టంతో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ఉన్నట్టుండి ఇప్పుడు ఆ పట్టమే తనకు వద్దు అంటున్నారు. దీని గురించి ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ‘‘నేను ఒక నటిగా పయనిస్తున్న ఈ మార్గంలో సంతోషం, సక్సెస్ అన్నిటికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితం ఎప్పటికీ తెరిచిన పుస్తకంగానే ఉంది. మీ ప్రేమాభిమానాలు దానికి అందాన్ని చేకూర్చాయి. నా విజయాలకు భుజం తట్టిన మీరు, కష్టకాలంలోనూ నన్ను నిలబెట్టారు. అభిమానంతో లేడీ సూపర్ స్టార్ అనే పట్టాన్ని కట్టబెట్టారు. మీ అమితాభిమానంతో అందించిన ఈ పట్టంకు రుణపడి ఉంటాను. అయితే ఇకపై లేడీ సూపర్ స్టార్‌గా కాకుండా నన్ను నయనతార అనే పిలవాలని వినమ్రంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పేరే నాకు అత్యంత సన్నిహితం. చిరునామా అది నన్ను మాత్రమే సూచిస్తుంది. ఒక నటిగానే కాకుండా వ్యక్తిగతంగానూ పట్టం, బిరుదులు గౌరవించదగినవే. అయితే కొన్ని సమయాల్లో అవి మనల్ని మనం చేసే పని నుంచి, కళా వృత్తి నుంచి, ముఖ్యంగా అభిమానుల నుంచి విడదీస్తాయి. మనం అందరం వ్యక్తం చేసుకునే ప్రియమైన భాష మనల్ని ఎల్లలు దాటి కలిపింది. భవిష్యత్తు నన్ను ఎలాంటి పరిణామాలకు గురిచేసిన మీ ఆదర అభిమానాలు ఎప్పటికీ మారవు అని తెలిసి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మీ అందరిని సంతోష పరచడానికి నా కఠిన శ్రమ కొనసాగుతుంది. సినిమాలే మనల్ని ఒకటిగా చేసింది. దాన్ని మనం అంతా కలిసి వేడుకల జరుపుకుందాం.. అని నయనతార పేర్కొన్నారు.
నా పేరే నాకు చిరునామా
Comments
Please login to add a commentAdd a comment