ప్రేమకథా చిత్రంగా డెక్‌స్టర్
తమిళసినిమా: సినిమా కథలు కొత్తగా ఉండవు. ఏ చిత్రంలోనైనా ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, వినోదభరిత అంశాలే ఉంటాయి. అయితే ఆ కథలను తెరపై ఆవిష్కరించే విధానమే కొత్తగా ఉండాలి. అలాంటి చిత్రాలే ప్రేక్షకుల ఆదరణను పొందుతాయి. అలాంటి మంచి కంటెంట్‌తో తెరకెక్కిన తాజా చిత్రం డెక్‌స్టర్. కథ పాతదే అయినా, దాన్ని కథనం, తెరపై ఆవిష్కరించిన తీరు జనరంజకంగా ఉన్న చిత్రం ఇది. బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఒక కుర్రాడి జీవితాన్ని ఎలాంటి పరిణామాలకు గురి చేసింది, దాని వల్ల ఎందరి ప్రాణాలు బలైయ్యాయి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్‌స్టర్ చిత్రాన్ని రామ్ ఎంటర్‌టెయినర్స్ పతాకంపై ప్రకాశ్.ఎస్‌వీ నిర్మించారు. సూర్యన్.జీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో రాజీవ్ గోవింద్, అభిషేక్ జార్జ్, యుక్తా పెర్వీ, సితార విజయన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య గోవిందరాజ్ చాయాగ్రహణం, శ్రీనాఽథ్ విజయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఒక గాఢమైన ప్రేమికుడి ఆవేదన, ప్రతీకారేచ్ఛ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా రూపొందింది. ప్రేమించిన ప్రియురాలు హత్యకు గురైతే ఆమె జ్ఞాపకాలు గుండెల్లో గుచ్చుకుంటుంటే అతని బాధను, మనోవేదనను చూడలేక అతని మిత్రుడు ఏం చేశాడు? అదే విధంగా అనుకోకుండా తారస పడిన బాల్య స్నేహితురాలు అతనికి ఏ విధంగా బాసటగా నిలిచింది? ఆమె కుటుంబ సమస్య ఏమిటి? దాన్ని ఆమె స్నేహితుడు పరిష్కరించగలిగాడా వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్‌స్టర్ చిత్రం ఊహించని మలుపులతో సాగుతుంది. చిత్రంలో ప్రేమ, పగ, ప్రతీకారాలతో పాటు రొమాన్స్, అందమైన పాటలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని శుక్రవారం తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment