మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌ పుస్తకం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌ పుస్తకం ఆవిష్కరణ

Published Mon, Mar 17 2025 2:50 AM | Last Updated on Mon, Mar 17 2025 2:50 AM

మెమరీ

మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌ పుస్తకం ఆవిష్కరణ

సాక్షి, చైన్నె: బ్లూ క్రాస్‌ ఆఫ్‌ ఇండియా 60 వసంతాలను గుర్తు చేస్తూ జ్ఞాపకాలు, మైలురాళ్లపై చరిత్రకారుడు వి. శ్రీరామ్‌, లక్ష్మణ్‌ల మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌ పుస్తకాన్ని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీఎన్‌ ప్రకాష్‌, జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా సంజయ్‌ గాంధీ, తమిళనాడు ప్రభుత్వ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ఎ.ఎల్‌. సోమయాజిలు ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన వేడుకలో 1964లో మొదటిసారిగా బ్లూ క్రాస్‌ ఆఫ్‌ ఇండి యా రిజిస్ట్రేషన్‌ చేయబడినప్పటి నుంచి స్వచ్ఛందంగా పనిచేసిన, పనిచేస్తున్న దేశంలో అత్యంత చురుకై న జంతు సంక్షేమ సమూహంగా అవతరించే వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా బ్లూ క్రాస్‌ సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చిన్ని కృష్ణ మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా ఏదైనా సంస్థను నడపడం కష్టం అని, అది కూడా జంతు సంక్షేమ రంగంలో ఒక సంస్థను నడపడం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సేవలు సాగాయని, మరెన్నో కొనసాగుతున్నాయని వివరించారు. జంతు సంరక్షణలో తాము నిరంతర సేవకులు అని వ్యాఖ్యానించారు.

అంగన్‌వాడీలలో

ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

– 7,783 పోస్టులకు నోటిఫికేషన్‌

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు 7,783 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో అంగన్‌ వాడీలలో ఖాళీలు పేరుకు పోతున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు హోరెత్తిన విషయం తెలిసిందే. పేద పిల్లలకు ప్రాథమికంగా విద్యా అడుగు పడేందుకు వేదికగా ఈ అంగన్‌వాడీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో పేరుకుపోతున్న ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్‌ గత కొంత కాలంగా వినిపిస్తూ వచ్చింది. ఈ పరిస్థితులలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కొన్ని మార్గదర్శకాలను మాత్రం రూపొందించారు. వాటికి అనుగుణంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల ఆధారంగా జిల్లాల వారీగా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు 3,886 పోస్టులు అంగన్‌వాడీ ఉద్యోగి, 305 మినీ అంగన్‌వాడీ ఉద్యోగి, 3592 అంగన్‌వాడీ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రూ..గుర్తు మార్పులో తప్పేముంది!

తమిళం నచ్చని వారికే సమస్య

సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్‌ ఆదివారం మీలో ఒకడ్ని అంటూ సామాజిక మాధ్యమం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వీడియో ద్వారా అన్ని వివరాలను విశదీకరించారు. ఇందులో బడ్జెట్‌ లోగోలో తమిళంలో రూ. అక్షరం చర్చకు దారి తీసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌.. అని ఆంగ్లంలో ఉపయోగిస్తున్న పదాన్ని తాము తమిళంలో రూ. అని పేర్కొన్నట్టు వివరించారు. భాషా విధానానికి ఏ మేరకు కట్టుబడి ఉన్నామో చాటే విధంగా తమిళంలో రూ. అని పొందు పరిచామన్నారు. అయితే, తమిళం అంటే నచ్చని వారికి ఇది పెద్ద సమస్యగా అనిపించినట్టుందన్నారు. దీనిని వివాదంగా వార్తల్లోకి ఎక్కించారని పేర్కొన్నారు. తాను కేంద్రం నుంచి రావాల్సిననిధుల విడుదల విషయంగా ప్రస్తావిస్తూ లేఖలు రాసినప్పుడు గానీయండి, ఆర్థిక మంత్రి అనేక సందర్భాలలో రూ. అని ఇంగ్లీషు రాసి ఉన్నారన్నవిషయాన్ని ఈసందర్భంగా తాను గుర్తు చేస్తున్నట్టు వివరించారు. అందరూ రూపాయలే అని రాయడం లేదు. కొన్ని సందర్భాలలో సాధారణంగా రూ. అనే రాస్తున్నా రని పేర్కొన్నారు. అయితే, భారత దేశ స్థాయి లో తమ తమ బడ్జెట్‌ హిట్‌, తమిళం కూడా హిట్‌ అని వ్యాఖ్యానించారు. అనంతరం బడ్జెట్‌ రూపకల్పన గురించిన ప్రశ్నకు ఆర్థిక సలహా మండలిలోని నిపుణుల సలహాలు సూచనలను గుర్తు చేశారు. సచివాలయంలో చాలా రోజులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంత్రులు, అధికారులు కూర్చుని ఈ బడ్జెట్‌ గురించి సమీక్షించి, చర్చించి సిద్ధం చేశామన్నారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఆరోపణలను బడ్జెట్‌తో నోళ్లు మూయించామన్నా రు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ పెంపు, అన్నింటా నంబర్‌ వన్‌ అనే లక్ష్యాన్ని సాధించడానికి తన ప్రయాణం విస్తృతం అవుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌  పుస్తకం ఆవిష్కరణ 1
1/1

మెమరీస్‌ అండ్‌ మైల్‌ స్టోన్స్‌ పుస్తకం ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement