
న్యాయ వ్యవస్థకు.. సంపూర్ణ సహకారం
న్యాయ వ్యవస్థకు అన్ని రకాల సదుపాయాల కల్పన, మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో సుప్రీం కోర్టు శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు శాఖ కోసం..
విద్యావంతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, తన ప్రభుత్వం రాజ్యాంగంలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి, న్యాయ శాఖ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయవిద్య కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఏటా తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్లు విరాళంగా ఇస్తోందని, మరణించిన న్యాయవాదుల చట్టపరమైన వారసులకు అందించే స్కాలర్‌షిప్‌ను రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచామన్నారు. పెండింగ్‌లో ఉన్న అదనపు సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 20 కోట్ల విరాళంగా ఇవ్వనున్నామన్నారు. న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటున్నదని, సంపూర్ణ సహకారం, మద్దతును ఇస్తున్నట్టు వివరించారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం 6 జిల్లా , సెషన్స్ కోర్టులు, 5 అదనపు జిల్లా కోర్టులు, 13 సబార్డినేట్ కోర్టులు, 2 అదనపు సబార్డినేట్ కోర్టులు, 7 ప్రాథమిక క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 18 జిల్లా సివిల్ , క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 3 జిల్లా సివిల్ కోర్టులు, 1 క్రిమినల్ జస్టిస్ ఆర్బిట్రేషన్ కోర్టు, 7 వాణిజ్య కోర్టులు, 9 ప్రత్యేక కోర్టులు, 2 కుటుంబ సంక్షేమ కోర్టులతో సహా 73 కొత్త కోర్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. న్యాయమూర్తుల కోసం కొత్త కోర్టు భవనాల నిర్మాణం నివాస భవనాలు, పాత కోర్టు భవనాల పునరుద్ధరణ, మద్రాసు హైకోర్టు, మధురై ధర్మాసనంలో కంప్యూటర్ సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు.
వివిధ స్థాయిలో జిల్లా, కింది కోర్టులలో ఉద్యోగాలను సృష్టించామని, ఖాళీలను భర్తీ చేశామని, న్యాయ కళాశాలల ఏర్పాటు విస్తృతం చేశామన్నారు. ఇలా.. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పన, మెరుగుపరచడంలో తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్న దృష్ట్యా, మరోసారి గుర్తుచేయాల్సి బాధ్యతతో చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఈ శాఖ ఏర్పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజ్యాంగం న్యాయవాదుల చేతుల్లో ఉంది..
దీనిని ఒక పత్రంగా పరిగణించ వద్దు.. ఇది మన జీవితం ప్రయాణం.. మన జీవన నాణ్యతను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఒక వాహనం, ఇది ఎల్లప్పుడూ ఈ భూమికి ఆత్మ... అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రకటనగా ఉటంకిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ముందుగా పలువురు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులకు పురస్కారాలను ప్రదానం చేశారు. బార్ అసోసియేషన్ ఘనతను చాటే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: భారత సుప్రీంకోర్టు రాజ్యాంగం ఆమోదించబడి 75 వసంతాలు కావడంతో శనివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో వార్షికోత్సవం జరిగింది. అలాగే చైన్నె బార్ అసోసియేషన్ 160వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ మహాదేవన్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ శ్రీరామ్, న్యాయశాఖ మంత్రి రఘుపతి, హిందూ మత ధార్మిక ధార్మిక శాఖ మంత్రి శేఖర్ బాబు, ఎంపీలు ఎన్.ఆర్. ఇళంగో, విల్సన్, గిరిరాజన్, అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్, చైన్నె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి తిరువెంగడమ్, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఇందులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ ముందుగా తాను ఒక విషయం చెప్ప దలచుకున్నట్టు పేర్కొంటూ, ఓ న్యాయమూర్తి తమిళంలో ఇక్కడ ప్రసంగిస్తారనుకుంటే, ఆంగ్లంలో మాట్లాడారని గుర్తు చేశారు. అదే మరో న్యాయమూర్తి ఆంగ్లంలో మాట్లాడుతారనుకుంటే తమిళంలో మాట్లాడేశారని పేర్కొంటూ, ఇదే ద్విభాషా విధానం అని వ్యాఖ్యానించారు. ఇది తమిళనాడుకు కష్టమైన పరిస్థితి కాదని, చాలా మంచి పరిస్థితి అని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్, తమిళనాడు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లిన ఆర్. మహాదేవన్, కె.వి. విశ్వనాథన్, ఎం.ఎం. సుందరేష్ అందించిన సేవలను కొనియాడారు. మద్రాసు హైకోర్టు చరిత్రను గుర్తు చేస్తూ బార్ అసోసియేషన్ 160 వసంతాల ప్రయాణాన్ని వివరించారు. సమాజంలోని అన్యాయం అనే వ్యాధిని నయం చేసేది న్యాయవాదులే అని, సామాజిక న్యాయం, వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ప్రాథమిక సంస్థగా కూడా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
సీఎం స్టాలిన్ వ్యాఖ్య
చైన్నెలో సుప్రీం కోర్టు శాఖకు వినతి
చట్టం ఓ చీకటి గది.
చట్టం ఒక చీకటి గది... అందులో న్యాయవాది వాద న ఒక దీపం.. అని మహా పండితుడు అన్న వ్యాఖ్య లను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో న్యాయవాదులు న్యాయమూర్తుల సహకారాన్ని అభినందిస్తున్నామన్నారు. మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు మొదలెట్టిన న్యాయవాదులు ఎందరో తమ వాదన నైపుణ్యాలతో జాతీయస్థాయికి ఎదిగి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి మన న్యాయమూర్తులు అనేక జ్ఞానోదయమైన తీర్పులు ఇచ్చారని, అందించారని వివరించారు. ఇందులో మద్రాస హైకోర్టు బార అసోసియేషన్ సహకారం కూడా గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి ఒక సాధనం అని పేర్కొంటూ ప్రభుత్వ స్వేచ్ఛ, జీవిత సూత్రం, సమానత్వం, సోదరభావం గుర్తింపునకు ఒక పద్ధతి అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చేసిన వ్యాఖ్య లు గుర్తుచేశారు. రాజ్యాంగపరంగా, భారతదేశం ఒక ప్రజాస్వామ్య – సోషలిస్ట్ –లౌకిక – సార్వభౌమ గణ తంత్రం అని, భారత రాజ్యాంగ ప్రవేశికలో చెప్పినట్లుగా న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని వివరించారు. రాజ్యాంగం ప్రభుత్వ నిర్మాణం, విధానాలను నిర్వచిస్తున్నారు. అధికారాలకు మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం, ప్రాథమిక హక్కులు, ప్రధాన సూత్రాలు, దేశం, పౌరుల విధులను కూడా నిర్వచిస్తుందన్నారు. భారతదేశంలో విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులు, విధానాలు రా జ్యాంగంలో సజీవంగా ఉంటుందన్నారు. రాజ్యాంగంపై జరిగే ఏ దాడికై నా వ్యతిరేకంగా స్వతంత్ర న్యాయవ్యవస్థ, అద్భుతమైన న్యాయమూర్తులు, దృఢమైన స్తంభాలుగా నిలుస్తున్నారన్నారు. రాజ్యాంగానికి న్యాయవాదుల సహకారం గురించి ప్రస్తావిస్తూ, ఆర్థికం, విద్య వంటి అనేక విషయాలను వివరించారు. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని నిర్ధారించడంలో, న్యాయవ్యవస్థ రాష్ట్రాల హక్కులను కాపాడుతూనే ఉందన్నారు.

న్యాయ వ్యవస్థకు.. సంపూర్ణ సహకారం
Comments
Please login to add a commentAdd a comment