యథార్థ ఘటనలతో రాబర్
తమిళసినిమా: ిసనిమా అనేది కల్పిత కథలతో కూడిన కాలక్షేప మాధ్యమమే కాదు. సమాజానికి కావలసిన చక్కని సందేశంతో కూడిన ప్రయోజనాత్మక కథా చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అవి సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకొస్తుంటాయి. అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రం రాబర్ అని చెప్పవచ్చు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చైన్ స్నాచింగ్ సమస్య ఒకటి. చైన్ స్నాచింగ్‌కు కారణాలు చాలానే ఉంటాయి. ఆడంబర జీవితాలకు అలవాటు పడే జులాయిగాళ్లు, కష్టపడకుండా సంపాదించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటారు. దీని వల్ల అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక సమస్యలకు గురవుతున్నారు. అలా ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అయితే అలా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వారు బాగుంటున్నారా అంటే వారు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం రాబర్. ముఖ్యంగా చైన్ స్నాచింగ్‌లతో మహిళలకు జరుగుతున్న బాధను చాలా స్పష్టంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని పాత్రికేయురాలు ఎస్.కవిత తన ఇంప్రెస్ ఫిలింస్ సంస్థతో కలిసి, మెట్రో ప్రొడక్షన్స్ అధినేత ఆనంద్‌కృష్ణన్‌తో కలిసి నిర్మించడం విశేషం. సత్య, డేనియల్, అన్నేపోప్, జయప్రకాశ్, దీపాశంకర్, సెండ్రాయన్, పాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్‌ఎం.పాండి దర్శకత్వం వహించారు. ఎన్‌ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం, సోహన్ శివనేశ్ సంగీతాన్ని అందించారు. అత్యంత సహజత్వంగా వాస్తవ సంఘటనలతో రూపొందించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. శక్తి ఫిలింస్ సంస్థ ద్వారా శక్తివేల్ తమిళనాడు విడుదల హక్కులను పొంది రాబర్ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment