ఉత్సాహంగా ఉగాది ముగ్గుల పోటీలు
కొరుక్కుపేట: ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వహక వర్గం, సర్ త్యాగరాయ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశ్వావసు ఉగాది మహోత్సవ వేడుకలు– 2025 సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. దీనికి పాతచాకలిపేటలోని శ్రీ సుబ్బారావు కల్యాణ మండపం వేదికైంది. మొదటి సారిగా ఈ పోటీల్లో కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్, కేటీిసీటీ బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటుకుని మొదటి బహుమతిని ఎస్.అపూర్వ, ఎస్.కీర్తిగ, రెండవ బహుమతిని. భూమిక, డి. మహ, మూడవ బహుమతిని వి.సర్వేశ్వరి, వి.అభినయ గెలుచుకున్నారు. మొదటి మూడు బహుమతులు కేసరి మహోన్నత పాఠశాల– టి.నగర్, ఈ పోటీలో కేటీసీటీ ప్రాథమిక పాఠశాల నాలుగవ తరగతి విద్యార్థినులు శ్రీమిత, కార్తీక ప్రత్యేక బహుమతి గెలుచుకున్నారు. పెద్దలకు నిర్వహించిన పోటీలో ప్రత్యేక బహుమతిని బి.లోహిత గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా మన్ని వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, వరలక్ష్మి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment