
అకాల వర్షంతో పులకింత
ఏర్కాడు కొండ మార్గంలో నేలకొరిగిన భారీ వృక్షం
వేసవిలో అకాల వర్షం పులకింతకు గురి చేసింది. చైన్నె శివారులలో గురువారం వేకువ జాము నుంచి చిరు జల్లులతో వర్షం పడింది. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగనున్నాయి. క్రమంగా వేసవి ప్రతాపం పెరుగుతున్న విషయం తెలిసిందే. భానుడు మరింతగా ఉగ్ర రూపం దాల్చే సమయంలో హఠాత్తుగా గురువారం అకాల వర్షంరాష్ట్రంలో పలు జిల్లాలను పలకరించింది. చైన్నె, శివారులలో చిరు జల్లుల వాన పడింది. ఆకాశం మేఘావృతంగా మారింది. కాసేపు కొన్ని చోట్ల జోరు వాన పడింది. వాతావరణం చల్లబడినట్టుగా పరిస్థితినెలకొంది. ఇక, రాష్ట్రంలో తిరువారూర్, ఈరోడ్, సేలం, తదితర ప్రాంతాలలో సైతం వర్షం పడింది. ఏర్కాడు మార్గంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అయితే, ఉపరితల ఆవర్తనంకారణంగా ఈ వర్షం పడుతున్నట్టు ,మరో నాలుగైన రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. –సాక్షి, చైన్నె

అకాల వర్షంతో పులకింత

అకాల వర్షంతో పులకింత

అకాల వర్షంతో పులకింత