
● నిరాకరించిన స్పీకర్ అప్పావు ● అన్నాడీఎంకే వాకౌట్ ●
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతా జీవన్ తన శాఖ పరిధిలోని ప్రాజెక్టులు, పథకాల గురించి బడ్జెట్‌లో జరిగిన కేటాయింపు గురించి సభకు వివరించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్ అప్పావును ప్రశ్నిస్తూ నినాదాలు హోరెత్తించారు.
వాకౌట్..
మంత్రులు పొన్ముడి, సెంథిల్ బాలాజీ, నెహ్రూపై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చించాలని, నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ నిరాకరించారు. సభలో నినాదాలు హోరెత్తడంతో గందరగోళం నెలకొంది. ఇది సమయం కాదంటూ స్పీకర్ పదే పదే సూచించినా అన్నాడీఎంకే సభ్యులు వినిపించుకోలేదు. చివరకు సభ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. తమ గళాన్ని నొక్కేస్తున్నారని, పదేపదే విజ్ఞప్తి చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని స్పీకర్ తీరుపై పళణి స్వామి ఆహ్రం వ్యక్తంచేశారు. మంగళవారం తమ పార్టీ శాసన సభా పక్ష నేత అన్ని నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇచ్చారని, ఇదే విషయంగా తాజాగా కూడా తాము స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. అయితే, అవిశ్వాస తీర్మానం నోటీసు విషయంగా స్పీకర్ స్పందించక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అవిశ్వాసానికి పట్టు