
నమ్మలేకపోతున్నా..!
తమిళసినిమా: ఎక్కడో కర్మాటకలోని ఒక మారు మూల గ్రామాల్లో పుట్టి పెరిగిన నటి రష్మికా మందన్నా. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా కిరాక్ పార్టీ చిత్రం ద్వారా కథానాయికిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సక్సెస్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దెబ్బతో కన్నడం, తెలుగు భాషల దర్శక నిర్మాతలు దృష్టిలో పడ్డారు. అలా తెలుగులో ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో ఈ అమ్మడి అందానికి ప్రేక్షకులు గులాం అయ్యారు. ఇక ఆ తరువాత నటించిన గీత గోవిందం చిత్ర విజయం రష్మికను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అంతే భారీ చిత్రాల అవకాశాలు ఈ అమ్మడిని చుట్టు ముట్టడం మొదలెట్టాయి.అలా రష్మికా మందన్నా నటుడు అల్లు అర్జున్‌తో జత కట్టిన పుష్ప ఆమెను నేషనల్ క్రష్ గా మార్చింది. అంతే దెబ్బతో బాలీవుడ్ ను టచ్ చేశారు. అక్కడ తొలి చిత్రం గుడ్ బై చిత్రంలోని అమితాబ్ బచ్చన్ వంటి బిగ్‌బీ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత నటించిన యానిమల్, ఛావా చిత్రాలు అగ్ర కథానాయకిగా మార్చాయి. కోలీవుడ్ లోకి సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సరసన ద్విభాషా చిత్రం వారిసులో నటించారు. అయితే ఇక్కడ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. ఏదేమైనా చాలా తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా మారిన రష్మికా మందన్నా ఈ నెల 5 న పుట్టిన రోజు. తాను 28 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 29వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్ స్ట్రాగామ్ ఒక పోస్ట్ పెట్టారు. అందులో ‘‘ ఇది నా పుట్టిన రోజు మాసం. అందువల్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజు వేడుకలపై ఆసక్తి తగ్గుతుంది. అయితే నాకు మాత్రం ఆసక్తి పెరుగుతూనే ఉంది. నేనిప్పుడు 29వ ఏట అడుగుపెడుతున్నానున్నది నమ్మలేక పోతున్నాను. గత ఏడాది ఆరోగ్యంగా, ఆనందంగా, సురక్షితంగా దాటేయడంతో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో నా పుట్టిన రోజు వేడుకను జరపుకోకుండా ఉంటానా?’’‘ అని పేర్కొన్నారు. దీంతో రష్మికా మందన్నా పోస్ట్‌కు నెటిజన్లు నుంచి లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
రష్మిక మందన్న