
ఆడిషన్‌లో రిజెక్ట్ అయ్యాను..!
తమిళసినిమా: అవమానాలు, ఆవేదనలు ప్రతి మనిషి జీవితంలోనూ కచ్చితంగా భాగం అవుతాయి. అయితే వాటిని సహనంతో అధిగమించినప్పుడే విజయ తీరాలను చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఇందుకు నటి పూజా హెగ్డే దీనికి అతీతం కాదు. ఈ విషయాన్ని ఆమెనే పేర్కొన్నారు. నటిగా ఈమె పయనం దశాబ్దం దాటింది. కోలీవుడ్‌లో ముఖముడి చిత్రంతో కథానాయికిగా తన పయనాన్ని ప్రారంభించిన పూజా హెగ్డేను తొలి చిత్రంతోనే అపజయం పలకరించింది. అయితే ఒక మార్గం మూసుకుంటే మరో మార్గం తెరుచుకుంటుందంటారు. నటి పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ ఈమెకు ఎర్ర తివాచీ పరిచింది. అక్కడ స్టార్ హీరోలతో జత కట్టి క్రేజీ కథానాయకిగా వెలిగారు. ఐయితే టాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాలు నిరాశ పరిచడంతో ఐరన్ లెగ్ ముద్ర వేశారు. దీంతో అక్కడ అవకాశాలు పిలిచి బడ్డాయి. అలాంటి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోలతో జత కడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడు సూర్య సరసన నటించిన రెట్రో చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే ఒకటిన తెరపైకి రానుంది. ప్రస్తుతం నటుడు విజయ్‌కు జంటగా జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటూ నటుడు రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన 4 చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.అదే విధంగా వరుణ్ ధావన్‌కు జంటగా ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈమె ఓ భేటీలో పేర్కొంటూ తాను సమీప కాలంలో ఒక చిత్ర ఆడిషన్ కోసం వెళ్లి నిరాకరణకు గురైనట్లు చెప్పారు. ఆ చిత్రంలోని పాత్రకు తన వయసు చాలదని చెప్పి వేరే సీనియర్ హీరోయిన్‌ను ఎంపిక చేశారని చెప్పారు. అయినా దాన్ని అవమానంగా భావించలేదని, మళ్లీ మళ్లీ ఆడిషన్స్‌కి వెళ్లడానికి తాను రెడీ అని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రతిభకు ఇగోను అంటనీయకండి అని అన్నారు. చాలా మందికి ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశమే రాదన్నారు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. చాలా మంది ప్రముఖ హీరో హీరోయిన్లు ఇప్పటికీ ఆడిషన్స్‌లో పాల్గొంటూనే ఉన్నారని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు.