
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలూరు అన్నారోడ్డులో ఆందోళన చేశారు. ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీలపై కక్ష సాధింపు కోసమే కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తోందన్నారు. ఒక మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లో ఇతరులు పెత్తనం చేసే విధంగా చట్టాలు తీసుకు రాకుండా చూడాలన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోలన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్య క్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చిత్తరంజన్, జిల్లా ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, మాజీ కార్పొరేటర్ జయప్రకాష్, మైనా రిటీ విభాగం జిల్లా కార్యదర్శి వాహీద్‌బాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.