
రూ.15.10 లక్షల నగదు స్వాధీనం
సేలం: రాష్ట్రం నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 15.10 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలు తెన్‌కాశి జిల్లా నుంచి కేరళకు, కేరళ నుంచి తమిళనాడుకు అక్రమంగా రవాణా అవుతున్నాయి. దీనిని నివారించడానికి, తమిళనాడు –కేరళ సరిహద్దులోని అరియాంగావ్ ఎకై ్సజ్ చెక్‌పోస్ట్ వద్ద కేరళ అధికారులు ముమ్మర నిఘా నిర్వహిస్తున్నారు. గురువారం తమిళనాడు నుంచి కేరళకు వెళ్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారును అనుమానంతో నిలిపి తనిఖీ చేశారు. తనిఖీల్లో ఒక బ్యాగులో రూ.500 నోట్లు కట్టలుగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని సంబంధిత పత్రాలు అడిగారు. అయితే, కారులో ఉన్న వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేవని తెలిసింది. ఆ వ్యక్తిని, కారును తేన్మలై పోలీస్ స్టేషన్‌న్‌కు అప్పగించారు. పోలీసుల విచారణలో, కారులో వచ్చిన వ్యక్తి విరుదునగర్‌కు చెందిన రామసామి కుమారుడు పాండియన్ అని, ఆ డబ్బును కేరళలోని ఎర్నాకుళానికి తీసుకెళ్తున్నానని, కానీ ఎవరికి ఇవ్వాలో తనకు తెలియదని చెప్పాడు. కేరళ పోలీసులు పాండియన్‌న్‌ను అరెస్టు చేసి అతని నుంచి రూ.15.10 లక్షల హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు.