
అర్హులందరికీ మహిళా హక్కు
● జూన్‌లో దరఖాస్తుల ఆహ్వానానికి నిర్ణయం ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడి ● ప్రజాసేవలు డిజిటల్ మయం ● ఆన్‌లైన్‌లో అసెంబ్లీ రికార్డులు
సాక్షి, చైన్నె: అర్హులైన మహిళలు అందరూ కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకంలో చేరేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ శుక్రవారం ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. జూన్‌లో దరఖాస్తులను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి సభ్యుడు ఈశ్వరన్ మహిళా హక్కు పథకం గురించి ప్రస్తావించారు. గృహిణులకు నెలవారిగా రూ.1000 పంపిణీ నిమిత్తం చేపట్టిన ఈ పథకం మరెందరో అర్హులైన వారికి దరి చేరలేదని సభకు వివరించారు. ఈపథకాన్ని విస్తరించాలని కోరారు. ఇందుకు సీఎం స్టాలిన్ సమాధానం ఇస్తూ ప్రసంగించారు. కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కింద ప్రస్తుతం 1.14 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 1000 అందజేస్తున్నామని వివరించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ నగదు ఇస్తామన్నారు. ఇప్పటికే మూడు విడతలుగా అర్హులను ఎంపిక చేశామని గుర్తుచేస్తూ, నాలుగో విడతగా జూన్‌లో దరఖాస్తులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 9 వేల ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయడానికి దరఖాస్తులను అందజేయనున్నామని స్టాలిన్ వివరించారు.
రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో
శాసనసభ రికార్డులను కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచిన మొదటి దశ పనులను సీఎం స్టాలిన్ ఉదయం అసెంబ్లీ ఆవరణలో పరిశీలించారు. 1952 నుంచి 2024 వరకు ఉన్న శాసన పత్రాలను కంప్యూటరీకరించి ప్రత్యేకంగా రూపొందించిన 'tnardifita.tn.gov.in ’వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో మొదటి దశలో 1952 నుంచి 2024 వరకు ఉన్న శాసన పత్రాలను కంప్యూటరీకరించారు. శాసనసభ సభ్యులు, సాధారణ ప్రజలు, పరిశోధకులు సహా అన్ని పార్టీల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన tnardifita.tn.gov.in ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. స్పీకర్ అప్పావు, మంత్రులు దురైమురగన్, పీటీఆర్ ఆర్ పళణివేల్ త్యాగరాజన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఉదయచంద్రన్, శాసనసభ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా అఖిల భారత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు సమాఖ్య అందించే జాతీయ ప్రజా బస్సు రవాణా పనితీరు మెరుగుదల ప్రత్యేక అవార్డుల్లో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలకు 19 అవార్డులు దక్కాయి. వీటిని ఈసందర్భంగా సీఎం స్టాలిన్‌కు రవాణామంత్రి శివశంకర్ అందజేశారు. అలాగే, తమిళనాడు సాగునీటి వ్యవసాయ ఆధునీకరణ ప్రాజెక్టుకు కేంద్ర నీటిపారుదల విద్యుత్ బోర్డు అందించిన ‘ఉత్తమ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ 2024 అవార్డును సీఎం స్టాలిన్‌కు ఆ శాఖ అధికారులు అందజేశారు. ఈసంద్భంగా మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ సమగ్ర విధానం ద్వారా, తమిళనాడు నీటి నిర్వహణ, నీటిపారుదల ఆధునికీకరణ ప్రాజెక్ట్ వ్యవసాయం, పశువులు, మత్స్య ఉత్పత్తిని మెరుగుపరిచినట్టు వివరించారు. ఇందుకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ‘ఉత్తమ సమగ్ర జలవనరుల నిర్వహణ 2024’ అవార్డు లభించిందన్నారు.
న్యూస్‌రీల్
గ్రేట్ తమిళ డ్రీమ్‌కు రూ.3 కోట్లు
ఉన్నత విద్యాశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపు ప్రకటనలో గ్రేట్ తమిళ్ డ్రీమ్ కార్యక్రమం గురించి మంత్రి కోవిచెలియన్ అసెంబ్లీలో వివరించారు. యువతరానికి ప్రాచీన తమిళ భాష గొప్పతనాన్ని వివరించేందుకుగాను ఈ కార్యక్రమానికి రూ.3 కోట్లు కేటాయించామన్నారు. సంప్రదాయ తమిళ భాష గొప్పతనాన్ని యువతరానికి తెలియజేయడం లక్ష్యంగా, ‘మాపెరుం తమిళ కనవు కార్యక్రమాలు’ కళాశాలలలో నిర్వహిస్తామన్నారు. వర్సిటీల వ్యవహారంలో న్యాయపోరాటం చేసిన చారిత్మాత్మక విజయాన్ని తమిళనాడుకే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందించిన సీఎం స్టాలిన్‌ను సత్కరించబోతున్నామని ప్రకటించారు. మే 3న నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా సీఎం స్టాలిన్‌కు జరిగే సత్కార వేడుకకు అన్ని పార్టీల శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు తరలి రావాలని అసెంబ్లీ వేదికగా ఈ సందర్భంగా కోవి చెలియన్‌కు పిలుపునిచ్చారు. అలాగే, పాఠశాల విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణత సాధించే బడులకు ఇక ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నామని ప్రకటించారు.
మంత్రి వర్గంలో మార్పులు తప్పవా?
ఎంఆర్‌కే పన్నీరుసెల్వం వంతు
డిజిటల్ మయం
సభలో ఐటీ శాఖకు సంబంధించి 2025–26 సంవత్సరానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు సంబంధించిన పద్దుల వివరాలను మంత్రి పీటీఆర్ పళణివేల్ త్యాగరాజన్ సభకు వివరించారు. ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మయం చేయనున్నట్టు ప్రకటించారు. వాట్సాప్ యాప్ ద్వారా సేవలను అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. రూ.100 కోట్లతో చైన్నె తరమణిలో ఐటీ కారిడార్‌ను ప్రభుత్వ సేవల నిమిత్తం ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. అలాగే, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖకు సంబంధించి బడ్జెట్ ఆర్థిక నివేదికను మంత్రి టీఆర్‌బీ రాజా సభలో దాఖలు చేశారు. తమిళనాడులోకి అన్ని సంస్థలు వస్తున్నాయని, గుజరాత్‌కు వెళ్లిన అనేక సంస్థలకు సంతోషం కరువైందన్నారు. ఇప్పడు ఆ సంస్థలు తమిళనాడు వైపుగా మళ్లీ చూస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.
జూన్ 12న డెల్టాకు మేట్టూరు నీళ్లు
ఈ ఏడాది నిర్ణీత జూన్ 12న డెల్టా రైతులకు సాగుబడి నిమిత్తం మేట్టూరు డ్యాం నీళ్లు విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి దురైమురుగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మే నెలాఖరులోపు తంజావూరు, తిరువారూర్ సహా 12 డెల్టా జిల్లాల పరిఽధిలోని కావేరి తీరంలో ఉన్న కాలువల పూడికతీత పనులు రూ.98 కోట్లతో శరవేగంగా జరుగుతున్నట్టు ఆయన వివరించారు.

అర్హులందరికీ మహిళా హక్కు

అర్హులందరికీ మహిళా హక్కు

అర్హులందరికీ మహిళా హక్కు