నాంపల్లి/హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, నట దిగ్గజం రేకందార్ నాగేశ్వరరావు(73) గుండెపోటుతో గురువారం హైదరాబాద్‌లోని సురభి కాలనీలో తుదిశ్వాస విడిచారు. సురభి బాబ్జిగా ప్రసిద్ధుడైన నాగేశ్వరరావు శ్రీ కృష్ణుడు, శ్రీరాముడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి పాత్రల తో జాతీయస్థాయిలో గుర్తింపుపొందారు. బి.వి. కారంత్ శిష్యరికంలో ఐదు సురభి నాటక సమా జాలను పునర్జీవింపజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వసలహాదారు డాక్టర్ కె.వి.రమణ ప్రోత్సా హంతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు లలి తాకళాతోరణం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర నాట్యకళామండలి పేరుతో 70 మంది కళాకారు లను దశాబ్ద కాలానికిపైగా పోషించారు. లవకుశ, మాయాబజార్, అనసూయ, శ్రీ వీరబ్రహ్మంగారి చరిత్ర, బొబ్బిలి యుద్ధం, బాలనాగమ్మ, చింతా మణి, రంగూన్ రౌడీ వంటి ప్రసిద్ధ నాటకాలను ప్రదర్శింపజేశారు. 2011లో సంగీత నాటక అకాడమీ అవార్డును, 2013లో పద్మశ్రీ పౌర పురస్కారాలను భారత ప్రభుత్వం నుంచి అందు కున్నారు. గత రెండేళ్లలో ఆయన భార్య ప్రేమలత, సోదరి రాజేశ్వరి కరోనాతో మృతి చెందారు.
నాలుగో ఏట నుంచి నటదిగ్గజం వరకు..
ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గం నుంచి దిగివచ్చే నారదుడు, పాతాళలోకం మాం త్రికులు.. ఇలా అన్నీ ఒకే తెరపై చూపిస్తు న్నారనగానే మనకు గుర్తుకు వచ్చేది సురభి సంస్థ. 135 ఏళ్ల క్రితం వనారస గోవిందరావు మొద లుపెట్టిన ఈ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరిం చింది. సురభి ఉమ్మడి కుటుంబంలో రేకందార్ కుటుంబం ఒకటి. వనారస గోవింద రావు కుమార్తె రేకం దార్ సుభద్రమ్మ.
ఈమె కుమారుడే రెకెందర్ నాగేశ్వర రావు. వీరి పూర్వీకు లు మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలుగునాట వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. నాగేశ్వరరావు 1949లో ఏపీలోని విజయ నగరం జిల్లా గజపతినగరంలో జన్మిం చారు. నాలుగో ఏట నాటకరంగంలోకి అరంగేట్రం చేసిన నాగేశ్వరరావు నటదిగ్గజంగా ఎదిగారు. శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, కార్యవర్థి, మొదౖ లెన పాత్రలు పోషించి ప్రేక్షకులను రంజిం పచేశారు.
సురభి పరంపరకు చెందిన శ్రీ వెంక టేశ్వర నాట్యమండలికి 42 ఏళ్లు కార్యదర్శిగా ఉన్నారు. ఐదు సురభి ఫెడరేషన్ల ఉమ్మడి బ్యానర్ అయిన సురభి నాటక కళా సంఘానికి 24 ఏళ్ల నుంచి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగేశ్వర రావు దర్శకత్వంలో రామరాజ్యం, శ్రీకృష్ణ లీలలు, వీరబ్రహ్మం, బాల నాగమ్మ, జై పాతాళ భైరవి నాటకాలు వచ్చాయి.
అనేక రాష్ట్రాలలో ఆయన సురభి నాటకాలను ప్రదర్శించారు. కాగా, మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్, మాజీ ప్రధాని పి.వి.నర సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ వంటి ఎందరో నాగేశ్వరరావు ప్రతిభను గుర్తించి అభినందిం చారు. 2000లో రాష్టస్థ్రాయి ఉత్తమ నాటకరంగ నిర్వాహకుడిగా పురస్కారం, 2004లో బళ్లారి రాఘవ పురస్కారం పొందారు. నాగేశ్వరరావును ఇటీవల సంగీత నాటక అకాడమీ వారు అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటలకు నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని లలితకళాతోరణానికి తీసుకు రానున్నారు. అనంతరం శేరిలింగంపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ రంగస్థల నటుడు, సురభి రెకెందర్ నాగేశ్వరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సంగీత, నాటకరంగానికి శతాబ్దానికిపైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని కొనియాడారు. నాగేశ్వరరావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నాగేశ్వరరావు మృతి పట్ల కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య టి.కిషన్‌రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment