Hyderabad: వీకెండ్‌ వండర్స్‌.. | All Events in Hyderabad This Weekend | Sakshi
Sakshi News home page

Hyderabad: వీకెండ్‌ వండర్స్‌..

Published Sat, Nov 9 2024 12:49 PM | Last Updated on Sat, Nov 9 2024 12:49 PM

All Events in Hyderabad This Weekend

సాక్షి, హైదరాబాద్‌: అధునాతన సిటీ లైఫ్‌ స్టైల్‌లో భాగంగా వారాంతాల్లో మ్యూజిక్‌ కన్సర్ట్స్, లైవ్‌ మ్యూజిక్‌ బ్యాండ్స్, ఔట్‌ డోర్‌ క్యాంపింగ్, వంటి విభిన్న కార్యక్రమాలతో పాటు స్టాండప్‌ కామెడీ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో భాగంగా నగరంలోని స్టాండప్‌ కమెడియన్స్‌ కాకుండా, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలకు చెందిన స్టాండప్‌ కమెడియన్స్‌ హైదరాబాద్‌కు వస్తున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలకు సందడి అప్పుడే మొదలైంది. ఇందులో భాగంగా గ్రాండ్‌ కేక్‌ మిక్సింగ్‌ వంటి ఈవెంట్లు జోరందుకున్నాయి.  

డార్క్‌ జోక్స్‌ ఆధ్వర్యంలో.. 
డార్క్‌ జోక్స్‌ ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్‌ హిందీ భాషల్లో స్టాండప్‌ కామెడీ షోను ఈ నెల 8 నుంచి 2025 ఫిబ్రవరి 20వ తేదీ వరకూ ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫోర్నై కేఫ్‌ హైదరాబాద్‌లో రాత్రి 8 గంటల నుంచి 9.15 గంటల వరకూ షో ఉంటుంది.

తెలుగు స్టాండప్‌ కామెడీ షో.. 
నగరంలో ఈ నెల 8 నుంచి 13 వరకూ సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకూ తెలుగు స్టాండప్‌ కామెడీ షోలను నిర్వహించనున్నారు. సిల్లీ సౌత్‌ కామెడీ ఆధ్వర్యంలో తొలి తెలుగు స్టాండప్‌ కామెడీ షో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. 8 నుంచి 10 వరకూ ది స్ట్రీట్‌ కామెడీ క్లబ్, మాదాపూర్‌లో, 11 నుంచి 
13 వరకూ ది హ్యాస్టాగ్‌ కేఫ్‌ కేపీహెచ్‌బీలోనూ ఈవెంట్‌ ఉంటుంది.

ఫ్లై జోన్‌లో ఇండోర్‌ గేమ్స్‌.. 
ఫ్లై జోన్‌ ప్రముఖ ప్రీమియర్‌ ఇండోర్‌ ట్రామ్పోలిన్‌ పార్క్‌. ఇక్కడ ఫ్లై జంప్, సాఫ్ట్‌ జోన్, స్లామ్‌ డన్‌్క, నిచ్చెన, డాడ్జ్‌బాల్, ఫ్లై లైన్‌ తదితర క్రీడలు అందుబాటులో ఉంచారు. 5 ఏళ్లు పైబడిన ఎవరైనా వెళ్లవచ్చు. ఈ నెల 9 నుంచి 30 వరకూ ప్రతి రోజు ఉంటుంది.  

ఇని్ఫనిటీ క్లబ్‌ కమ్యూనిటీ రన్‌.. 
ఇని్ఫనిటీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 30 వరకూ కమ్యూనిటీ రన్‌ నిర్వహిస్తున్నారు. నగర ప్రజల ఆరోగ్యకరమైన జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడం కోసమే ఇటువంటి ఈవెంట్స్‌ ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 
గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలతో ముగుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement