city life
-
Hyderabad: వీకెండ్ వండర్స్..
సాక్షి, హైదరాబాద్: అధునాతన సిటీ లైఫ్ స్టైల్లో భాగంగా వారాంతాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్, ఔట్ డోర్ క్యాంపింగ్, వంటి విభిన్న కార్యక్రమాలతో పాటు స్టాండప్ కామెడీ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో భాగంగా నగరంలోని స్టాండప్ కమెడియన్స్ కాకుండా, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలకు చెందిన స్టాండప్ కమెడియన్స్ హైదరాబాద్‌కు వస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు సందడి అప్పుడే మొదలైంది. ఇందులో భాగంగా గ్రాండ్ కేక్ మిక్సింగ్ వంటి ఈవెంట్లు జోరందుకున్నాయి. డార్క్ జోక్స్ ఆధ్వర్యంలో.. డార్క్ జోక్స్ ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్ హిందీ భాషల్లో స్టాండప్ కామెడీ షోను ఈ నెల 8 నుంచి 2025 ఫిబ్రవరి 20వ తేదీ వరకూ ప్రతి గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫోర్నై కేఫ్ హైదరాబాద్‌లో రాత్రి 8 గంటల నుంచి 9.15 గంటల వరకూ షో ఉంటుంది.తెలుగు స్టాండప్ కామెడీ షో.. నగరంలో ఈ నెల 8 నుంచి 13 వరకూ సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకూ తెలుగు స్టాండప్ కామెడీ షోలను నిర్వహించనున్నారు. సిల్లీ సౌత్ కామెడీ ఆధ్వర్యంలో తొలి తెలుగు స్టాండప్ కామెడీ షో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. 8 నుంచి 10 వరకూ ది స్ట్రీట్ కామెడీ క్లబ్, మాదాపూర్‌లో, 11 నుంచి 13 వరకూ ది హ్యాస్టాగ్ కేఫ్ కేపీహెచ్‌బీలోనూ ఈవెంట్ ఉంటుంది.ఫ్లై జోన్లో ఇండోర్ గేమ్స్.. ఫ్లై జోన్ ప్రముఖ ప్రీమియర్ ఇండోర్ ట్రామ్పోలిన్ పార్క్. ఇక్కడ ఫ్లై జంప్, సాఫ్ట్ జోన్, స్లామ్ డన్్క, నిచ్చెన, డాడ్జ్‌బాల్, ఫ్లై లైన్ తదితర క్రీడలు అందుబాటులో ఉంచారు. 5 ఏళ్లు పైబడిన ఎవరైనా వెళ్లవచ్చు. ఈ నెల 9 నుంచి 30 వరకూ ప్రతి రోజు ఉంటుంది. ఇని్ఫనిటీ క్లబ్ కమ్యూనిటీ రన్.. ఇని్ఫనిటీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 30 వరకూ కమ్యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. నగర ప్రజల ఆరోగ్యకరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే ఇటువంటి ఈవెంట్స్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలతో ముగుస్తుంది. -
సీన్ రివర్స్; పట్నం నుంచి పల్లెకు..
సాక్షి, భైంసాటౌన్: గ్రామాల్లో ఉపాధి లేకపోవడం, చిన్నా చితక పనులు చేసుకుందామంటే సమాజంలో చిన్నచూపు, ఉన్నతంగా బతకాలనే ఆశ.. ఇలా కారణమేదైనా.. యువత ఎక్కువగా పట్నం బాట పట్టినవారే.. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచి ఉద్యోగాల కోసం ఊరు విడిచిన వారే.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. ఐదంకెల జీతం ఉండడంతో తమపై ఆధారపడిన కుటుంబానికి కొంతైనా సహాయ పడవచ్చని భావించినవారే.. అయితే ప్రస్తుతం వారి ఆలోచన మారుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఖర్చులు పెరగడం, వేతనం సరిపోకపోవడం, లేదా ఉద్యోగ సంతృప్తి లేకపోవడంతో సొంతూరిలోనే ఏదైనా పని చేసుకుందామని పట్నం వీడి ఊరిబాట పడుతున్నారు. పని ఒత్తిడి, భద్రత కరువు చదువుకున్న యువత ఎక్కువగా తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాలు స్థానికంగా ఉండకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి మహా నగరాలకు వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ సంస్థల్లో ఐదంకెల జీతం చేసేవారు. తమ వేతనంలోంచి నెలనెలా కొంత తమ కుటుంబ సభ్యులకు పంపేవారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ వారిని కలుసుకోవడానికి రావడానికి వీలుంటుంది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌లాంటి సంస్థల్లో అధిక వేతనం ఉన్నా.. పని ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దీంతోపాటు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. ఉద్యోగానికి భద్రత కూడా ఉండదు. అంతేగాకుండా మహానగరాల్లో ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి. దీంతో పని ఒత్తిడి ఓవైపు.. పెరుగుతున్న ఖర్చులు మరోవైపు.. ఇలా మహానగరాల్లో పలువురు విసిగి వేశారుతున్నారు. పలకరించేవారు లేక.. కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత సమాజంలో.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వారే కరువయ్యారు. పట్టణాల్లోనూ ఇప్పుడు ఈ సంస్కృతి ఎక్కువవుతోంది. మహానగరాల్లోనైతే చెప్పాల్సిన పని లేదు. తమ ఇంటిపక్కన ఉండేవారి ముఖమే తెలియదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్ల ప్రభావంతో నలుగురు కలిసినా.. ఎప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే ధ్యాసంతా.. ఇక మనసారా మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకునే తీరిక ఎక్కడిది.. పక్కనే ఉన్నా పలకరించం కానీ.. వాట్సాప్‌లో మాత్రం గుడ్మార్నింగ్లు.. గుడ్ నైట్లకు తక్కువుండదు.. ఎదురుగా ఉన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం.. కానీ ఫేస్బుక్లో మాత్రం హ్యాపీ బర్త్‌డేలు.. ఇలా మనవారితో కంటే స్మార్ట్ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. దీంతో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. అనుబంధాలకు దగ్గరవ్వాలని.. పెద్ద, పెద్ద నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారే ఎక్కువగా ఉంటారు. పొద్దున లేచింది మొదలు ఉరుకులు.. పరుగులు.. కాలు బయట పెడితే.. ట్రాఫిక్ తంటా.. సమయానికి ఆఫీసుకు వెళ్లకపోతే బాస్‌తో తంటా.. ఇన్ని తంటాల నడుమ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదోవ పట్టే అవకాశం ఉంది. ఇప్పటి పిల్లలకు అమ్మానాన్న తప్పితే అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, ఇతర బంధువుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలు విడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికంగా తమవారికి అందుబాటులో ఉంటూ వ్యాపారం, వ్యవసాయంలాంటివి చేసుకుందామని, పిల్లలకు అనుబంధాల విలువ తెలియాలని సొంతూళ్లకు వస్తున్నారు. పాడితో ఉపాధి పొందుతున్నా.. గతంలో ఇక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లాను. అక్కడ మూడేళ్లు పనిచేశాను. అక్కడి ఆఫీస్‌లో అడ్మిన్‌గా పని చేశాను. నెలకు రూ.40 వేతనం వచ్చేది. వేతనం బాగానే ఉన్నా.. ఎక్కడో వెలితిగా ఉండేది. ప్రతిసారీ ఊరి వైపు మనసు మళ్లేది. సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. ముందునుంచే నాన్న గారు పాలవ్యాపారం చేస్తున్నారు. మాకున్న వ్యవసాయ భూమిలో పాడిపశువులు పెంచుతూ పాల ద్వారా ఉపాధి పొందుతున్నాను. ఇప్పుడు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేసుకుంటుండటం సంతృప్తిగా ఉంది. – సందీప్, భైంసా 35 వేల వేతనం వదులుకున్నా.. నేను ఐదేళ్లు హైదరాబాద్‌లోని ఫైబర్‌నెట్ సంస్థలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేశాను. నెలకు రూ.35వేల వరకు వేతనం వచ్చేది. అయితే ఎన్ని రోజులు పనిచేసినా సంతృప్తి లేకపోవడం, దాంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. మన కోసం మనం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మాకున్న ఆరెకరాల వ్యవసాయ భూమినే సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలే మల్బరీ సాగు ప్రారంభించాం. పట్టు పురుగుల పరిశ్రమ స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత పురోగతి సాధిస్తాం. – రజిని శేఖర్, భైంసా ఫార్మసీని వదిలి.. ఫార్మర్‌గా మారి.. మాది సారంగపూర్ మండలం కంకెట గ్రామం. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో రూ.25 వేల వేతనంతో ఉద్యోగం చేశాను. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్నా. కానీ పెద్దగా సంపాదన లేదు. వచ్చే వేతనం ఇక్కడితో పోల్చుకుంటే ఎక్కువే. కానీ.. సిటీలో అది చాలా తక్కువ. ఎంత కష్టపడ్డా సంతృప్తి కూడా ఉండేది కాదు. ఈ క్రమంలోనే సొంతూరిలో కష్టపడదామని ఏడాది క్రితం కంకెటకు వచ్చేశాను. భూమిని నమ్ముకుని సాగు చేస్తున్నాను. కాస్త కష్టంగా ఉన్నా.. కన్న ఊరిలో పనిచేసుకోవడం తృప్తిగా ఉంది. – పుస్పూర్ సుభాష్, కంకెట -
అంతరాంతరాల్లో రగులుతున్న పద్యం
జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జననం 12 జనవరి 1954 మరణం 12 జనవరి 1993 గుండెనిండా బాధ కళ్లనిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండి ఉండి ఉధృతమయ్యేందుకు ఉద్వేగ భరితమైన సన్నివేశం కావాలి... సరళమైన భాషనుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు మధ్యతరగతి కౌగిట్లోని మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్ళీ మళ్ళీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయిపోయింది ... నానించి ఏమీ ఆశించని వాళ్ళే నాకెంతగానో సహకరించారు ‘ఐసోనెక్స్’ నుంచి ‘సైక్లోసెరిన్’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగ నిరోధక శక్తి సన్నగిల్లి ఆరు నెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్ని పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్, క్యానమైసిన్ ఇంజక్షన్లు నా వొంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సెడెఫైక్ట్స్ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. (చనిపోవడానికి ఆరు నెలల ముందు, ‘సిటీ లైఫ్’ నేపథ్యం పేరిట 1992 జూలైలో అలిశెట్టి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం.) -
వైన్ షైన్
మార్నింగ్ టైమ్‌లో షోరూం ప్రారంభోత్సవం.. ఆర్ట్ గ్యాలరీలో ఈవెనింగ్ ‘షో’.. బుక్‌షాప్‌లో రీడింగ్ సెషన్.. వర్క్‌షాప్‌లో హాట్ హాట్ డిస్కషన్.. ఏదైనా సరే వైన్ లేనిదే నాట్ ఫైన్ అంటున్నారు సిటీజనులు. నగరంలో వైన్ ప్రియత్వం రోజు రోజుకూ ఉ‘ప్పొంగు’తోంది. వైన్ తాగితే షైనింగ్ అనే మాటలో నిజమెంతో గానీ వైన్ కల్చర్ మాత్రం అంతకంతకూ కాంతులీనుతూ సిటీలైఫ్‌లో భాగమైపోతోంది. - ఎస్.సత్యబాబు సిటీలో ఫ్రెంచ్ దేశస్తులు పెరుగుతుండడంతో వారి ఆహారపు అలవాట్లు మనపై ప్రభావం చూపిస్తున్నాయి. వైన్‌లో ఆల్కహాల్ శాతం కేవలం 8 నుంచి 12 వరకు మాత్రమే ఉండడం వల్ల మిగతా మద్యం రకాల కంటే ఇది ఆరోగ్యప్రదమని పార్టీపీపుల్ విశ్వసిస్తున్నారు. కొన్ని గంటల పాటు ముచ్చట్లతో గడిపే సందర్భాల్లో పెద్దగా కిక్ ఇవ్వని వైన్‌ను అనువైన డ్రింక్‌గా ఎంచుకుంటున్నారు. అందిన వైన్ తీయన... సిటీలో ఫుడ్ కమ్ వైన్ ఫెస్టివల్స్ కంబైన్డ్‌గా నిర్వహిస్తున్నారు. ‘వైన్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ వైన్ లాభాలను ప్రచారం చేస్తూ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది. స్టార్ హోటళ్లలో ఏడాదికి కనీసం 30 వరకూ జరిగే వైన్ టేస్టింగ్ సెషన్లలో పేజ్‌త్రీ పీపుల్, సోషలైట్లు, పోష్ సర్కిల్‌కు రకరకాల వైన్లను రుచి చూపించడం, కాంబినేషన్ వంటకాలపై అవగాహన కల్పించడం షురూ అయింది. ద్రాక్ష పండ్లను మదించడం ద్వారా వైన్ పుడుతుందనే అర్థం వచ్చేలా ద్రాక్షపండ్లను తొక్కడం వంటి సరదా గ్రేప్ ఫెస్టివల్స్ కూడా నగరంలో ఇటీవల పెరిగాయి. విదేశీ హవా.. సిటీలో నాలుగైదేళ్ల క్రితం ఖరీదైన వైన్ బ్రాండ్లు మాత్రమే అమ్ముడయ్యేవి. ఇప్పుడు మధ్య రకం కూడా సేల్ అవుతున్నాయి. ‘ఒకప్పుడు కస్టమర్లు రెడ్ లేదా వైట్ వైన్ మాత్రమే అడిగేవారు. ఇప్పుడు లేబుల్స్ పేర్లతో సహా అడుగుతున్నార’ని ఒహ్రీస్ బసేరా రెస్టారెంట్‌కు చెందిన అఖిలేష్ కుమార్ చెప్పారు. సిటీలో వినియోగిస్తున్న వైన్ రకాల్లో రెడ్‌వైన్ ప్రథమ స్థానం. రూ. 1000 నుంచి రూ.10 వేల వరకూ విలువైన వైన్లు అందుబాటులో ఉన్నాయి. లైఫ్‌స్టైల్.. కిక్.. వైన్ ఇష్టపడేవారు దాన్నొక లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్‌గా భావిస్తారు. మిగిలిన మద్యం వెరైటీలతో దీన్ని కలపడం చాలా మంది ఇష్టపడరు. పార్క్‌హయత్, వెస్టిన్, ట్రైడెంట్ వంటి హోటళ్లలో ప్రత్యేక వైన్ కౌంటర్ల ఏర్పాటుకు కారణమిదే. కేవ లం లిక్కర్షాప్లలో మాత్రమే కాకుం డా మాల్స్‌లో కూడా వైన్ విక్రయించాలని వైన్ ప్రియులు అంటున్నారు. తొలి ఇంపోర్టర్ మేమే... గత కొంతకాలంగా సిటీలో వైన్‌ను ఒక జీవనశైలి ఉత్పత్తిగా భావించే ధోరణి పెరిగింది. హానికరం కానిది, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కూడా ఇది మంచిదని విదేశీయులు భావిస్తారు. దీనిని ఇప్పుడిప్పుడే మన వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వైన్ దిగుమతి చేసుకుంటున్న సంస్థల్లో సిటీ నుంచి మేమే ఉన్నాం. - రవికాంత్ పోపూరి, పిటార్స్ ఇండియా ఏటేటా భారతదేశంలో వైన్ వినియోగం 20 శాతం మేర పెరుగుతోంద ంది ఓ సర్వే. అదే క్రమంలో సిటీ కూడా వైన్ సేవనంలో ముందంజలో ఉన్న గోవా, ముంబై, బెంగళూరు నగరాల సరసన చేరిపోయింది. -
భాగ్యనగర భగీరథుడు
భాగ్యనగర భగీరథుడాయన. మూసీ, మంజీరా నదులకు ఆనకట్టలు కట్టి ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చిన మహనీయుడాయన. ఉస్మాన్ సాగర్, నిజాంసాగర్, హిమాయత్ సాగర్, అలీసాగర్, నందికొండ ప్రాజెక్టు వంటి నిర్మాణాలన్నీ ఆయన చలవే. ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పోషించిన పాత్ర చిరస్మరణీయం. శతాబ్దాల కిందట కులీకుతుబ్ షాల కాలంలో హుస్సేన్‌సాగర్ నిర్మించిన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో చాలాకాలం పాటు కొత్తగా వెలసిన ఆనకట్టలేవీ లేవు. మూసీ నదికి అడపా దడపా వరదలు వస్తుండేవి. వరదలను అడ్డుకునే కట్టడమేదీ ఉండేది కాదు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చొరవతో హైదరాబాద్ నగరం సహా తెలంగాణ ప్రాంతంలో పలు ఆనకట్టలు వెలశాయి. నవాబ్ అలీ సారథ్యంలోనే పలు ప్రతిష్టాత్మకమైన కట్టడాలూ రూపుదిద్దుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు రూపకల్పన చేసినది ఆయనే. ఇంజనీర్‌గా ప్రస్థానం.. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. ఆయన తండ్రి మీర్ వయిజ్ అలీ నిజాం సర్కారులో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసేవారు. హైదరాబాద్‌లో 1877 జూలై 11న జన్మించిన నవాబ్ అలీ, ఇక్కడి సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో, మదర్సా-ఇ-ఆలియాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. తర్వాత నిజాం కాలేజీలో చేరారు. చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందడంతో విదేశాల్లో చదువుకునేందుకు సర్కారు స్కాలర్షిప్ లభించింది. ఇంగ్లండ్‌లోని కూపర్స్ హిల్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్‌కు 1899లో తిరిగి వచ్చాక ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1913లో ప్రజా పనుల శాఖతో పాటు టెలిఫోన్ శాఖకు కార్యదర్శిగా నియమితుడుయ్యారు. మరో ఐదేళ్లకు, 1918లో చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. నవాబ్ అలీ చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న కాలంలోనే ఆయన ఆధ్వర్యంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆయన హయాంలోనే టెలిఫోన్ సేవలు జిల్లాలకు విస్తరించాయి. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ భవనం, యునానీ ఆస్పత్రి, జూబ్లీ హాల్, ఉస్మానియా ఆస్పత్రి వంటి భవనాల నిర్మాణానికీ ఆయనే సారథ్యం వహించారు. అప్పటి బాంబే ప్రభుత్వం కూడా నవాబ్ అలీ సేవలను వినియోగించుకుంది. సింధు నదిపై సుక్కుర్ బ్యారేజీ నిర్మాణం కోసం ఆర్థిక, సాంకేతిక సలహాల కోసం సంప్రదించింది. మోక్షగుండం విశ్వేశరయ్యతో కలసి నవాబ్ అలీ సుక్కుర్ బ్యారేజీ నిర్మాణంపై బాంబే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అప్పటి మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య తలెత్తిన కృష్ణా, తుంగభద్ర నదీజలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడంలోనూ నవాబ్ అలీ కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన ఆనకట్టకు ఆయన గౌరవార్థం అలీ సాగర్‌గా నామకరణం చేశారు. గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. సాగునీటి రంగంలో గణనీయమైన సేవలు అందించిన నవాబ్ అలీ జంగ్ బహదూర్‌కు దురదృష్టవశాత్తు తగినంత ప్రాచుర్యం లభించలేదు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం నవాబ్ అలీ సేవలను గుర్తించింది. నవాబ్ అలీ జ్ఞాపకార్థం ఆయన పుట్టిన రోజైన జూలై 11న తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించింది. -
ఏమిటా స్పెషల్
న్యూ ఇయర్స్ వస్తుంటాయి... పోతుంటాయి... కానీ కొన్నే మెమరబుల్‌గా మిగిలిపోతాయంటూ ఎంతో సంబరంగా చెబుతోంది క్యూటీ కత్రినా కైఫ్. సెలబ్రేషన్స్ మూడ్ పోయి మూడు వారాలు దాటిపోయిన తరువాత అమ్మడు ఇప్పుడా టాపిక్ ఎందుకు రైజ్ చేసిందనేగా..! ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాయ్‌ఫ్రెండ్ రణబీర్‌కపూర్‌తో కలసి సెలబ్రేట్ చేసుకుందీ సుందరి. ఆ విషయం అయితే చెప్పడం లేదు గానీ... ‘నిజంగా ఈ న్యూ ఇయర్ నాకు ఎంతో స్పెషల్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్’ అంటూ లొడలొడా సంతోషాన్ని పంచుకుంది కత్రినా. ‘మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందట కదా..’ అంటే ఠక్కున టాపిక్ డైవర్ట్ చేసేసిందీ టక్కరి భామ!