వైన్ షైన్ | Wine Culture | Sakshi
Sakshi News home page

వైన్ షైన్

Published Sat, Oct 17 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

వైన్  షైన్

వైన్ షైన్

మార్నింగ్ టైమ్‌లో షోరూం ప్రారంభోత్సవం.. ఆర్ట్ గ్యాలరీలో ఈవెనింగ్ ‘షో’.. బుక్‌షాప్‌లో రీడింగ్ సెషన్.. వర్క్‌షాప్‌లో
 హాట్ హాట్ డిస్కషన్.. ఏదైనా సరే వైన్ లేనిదే నాట్ ఫైన్ అంటున్నారు సిటీజనులు. నగరంలో వైన్ ప్రియత్వం రోజు రోజుకూ ఉ‘ప్పొంగు’తోంది. వైన్ తాగితే షైనింగ్ అనే మాటలో నిజమెంతో గానీ వైన్ కల్చర్ మాత్రం అంతకంతకూ కాంతులీనుతూ  సిటీలైఫ్‌లో భాగమైపోతోంది.        
 - ఎస్.సత్యబాబు
 
సిటీలో ఫ్రెంచ్ దేశస్తులు పెరుగుతుండడంతో వారి ఆహారపు అలవాట్లు మనపై ప్రభావం చూపిస్తున్నాయి. వైన్‌లో ఆల్కహాల్ శాతం కేవలం 8 నుంచి 12 వరకు మాత్రమే ఉండడం వల్ల మిగతా మద్యం రకాల కంటే ఇది ఆరోగ్యప్రదమని పార్టీపీపుల్ విశ్వసిస్తున్నారు. కొన్ని గంటల పాటు ముచ్చట్లతో గడిపే సందర్భాల్లో పెద్దగా కిక్ ఇవ్వని వైన్‌ను అనువైన డ్రింక్‌గా ఎంచుకుంటున్నారు.
 
అందిన వైన్ తీయన...
సిటీలో ఫుడ్ కమ్ వైన్ ఫెస్టివల్స్ కంబైన్డ్‌గా నిర్వహిస్తున్నారు. ‘వైన్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ వైన్ లాభాలను ప్రచారం చేస్తూ సభ్యుల సంఖ్యను పెంచుకుంటోంది. స్టార్ హోటళ్లలో ఏడాదికి కనీసం 30 వరకూ జరిగే వైన్ టేస్టింగ్ సెషన్లలో పేజ్‌త్రీ పీపుల్, సోషలైట్లు, పోష్ సర్కిల్‌కు రకరకాల వైన్‌లను రుచి చూపించడం, కాంబినేషన్ వంటకాలపై అవగాహన కల్పించడం షురూ అయింది. ద్రాక్ష పండ్లను మదించడం ద్వారా వైన్ పుడుతుందనే అర్థం వచ్చేలా ద్రాక్షపండ్లను తొక్కడం వంటి సరదా గ్రేప్ ఫెస్టివల్స్ కూడా నగరంలో ఇటీవల పెరిగాయి.
 
విదేశీ హవా..

సిటీలో నాలుగైదేళ్ల క్రితం ఖరీదైన వైన్ బ్రాండ్లు మాత్రమే అమ్ముడయ్యేవి. ఇప్పుడు మధ్య రకం కూడా సేల్ అవుతున్నాయి. ‘ఒకప్పుడు కస్టమర్లు రెడ్ లేదా వైట్ వైన్ మాత్రమే అడిగేవారు. ఇప్పుడు లేబుల్స్ పేర్లతో సహా అడుగుతున్నార’ని ఒహ్రీస్ బసేరా రెస్టారెంట్‌కు చెందిన అఖిలేష్ కుమార్ చెప్పారు. సిటీలో వినియోగిస్తున్న వైన్ రకాల్లో రెడ్‌వైన్ ప్రథమ స్థానం.  రూ. 1000 నుంచి రూ.10 వేల వరకూ విలువైన వైన్‌లు అందుబాటులో ఉన్నాయి.

లైఫ్‌స్టైల్.. కిక్..
వైన్ ఇష్టపడేవారు దాన్నొక లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్‌గా భావిస్తారు. మిగిలిన మద్యం వెరైటీలతో దీన్ని కలపడం చాలా మంది ఇష్టపడరు. పార్క్‌హయత్, వెస్టిన్, ట్రైడెంట్ వంటి హోటళ్లలో ప్రత్యేక వైన్ కౌంటర్ల ఏర్పాటుకు కారణమిదే. కేవ లం లిక్కర్‌షాప్‌లలో మాత్రమే కాకుం డా మాల్స్‌లో కూడా వైన్ విక్రయించాలని వైన్ ప్రియులు అంటున్నారు.
 
తొలి ఇంపోర్టర్ మేమే...
గత కొంతకాలంగా సిటీలో వైన్‌ను ఒక జీవనశైలి ఉత్పత్తిగా భావించే ధోరణి పెరిగింది. హానికరం కానిది, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కూడా ఇది మంచిదని విదేశీయులు భావిస్తారు. దీనిని ఇప్పుడిప్పుడే మన వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వైన్ దిగుమతి చేసుకుంటున్న సంస్థల్లో సిటీ నుంచి మేమే ఉన్నాం.    
     - రవికాంత్ పోపూరి, పిటార్స్ ఇండియా
 
 ఏటేటా

భారతదేశంలో వైన్ వినియోగం 20 శాతం మేర పెరుగుతోంద ంది ఓ సర్వే. అదే క్రమంలో సిటీ కూడా వైన్ సేవనంలో ముందంజలో ఉన్న గోవా, ముంబై, బెంగళూరు నగరాల సరసన చేరిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement