
ఏమిటా స్పెషల్
న్యూ ఇయర్స్ వస్తుంటాయి... పోతుంటాయి... కానీ కొన్నే మెమరబుల్‌గా మిగిలిపోతాయంటూ ఎంతో సంబరంగా చెబుతోంది క్యూటీ కత్రినా కైఫ్. సెలబ్రేషన్స్ మూడ్ పోయి మూడు వారాలు దాటిపోయిన తరువాత అమ్మడు ఇప్పుడా టాపిక్ ఎందుకు రైజ్ చేసిందనేగా..! ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాయ్‌ఫ్రెండ్ రణబీర్‌కపూర్‌తో కలసి సెలబ్రేట్ చేసుకుందీ సుందరి.
ఆ విషయం అయితే చెప్పడం లేదు గానీ... ‘నిజంగా ఈ న్యూ ఇయర్ నాకు ఎంతో స్పెషల్. ఐ ఎంజాయ్‌డ్ ఏ లాట్’ అంటూ లొడలొడా సంతోషాన్ని పంచుకుంది కత్రినా. ‘మీ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిందట కదా..’ అంటే ఠక్కున టాపిక్ డైవర్ట్ చేసేసిందీ టక్కరి భామ!