హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 150
► ఖాళీల వివరాలు: టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్ ట్రెయినీలు–80, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు–70.
► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
► వెబ్‌సైట్: hal-india.co.in
ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌లు
హైదరాబాద్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 150
► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05.
► విభాగాలు:ఈసీఈ,సీఎస్‌ఈ,మెకానికల్,ఈఈఈ.
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 31.01.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి.
► స్టైపెండ్: ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022
► వెబ్‌సైట్: ecil.co.in
హెచ్‌పీసీఎల్, విశాఖ రిఫైనరీలో 100 అప్రెంటిస్‌లు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), విశాఖ రిఫైనరీ.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్(ఇంజనీరింగ్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 100
► సబ్జెక్టులు/విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,పెట్రోలియం ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు.
► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 07.01. 2022నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
► స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022
► వెబ్‌సైట్: mhrdnats.gov.in
Comments
Please login to add a commentAdd a comment