కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
కరీంనగర్‌టౌన్/గంగాధర (చొప్పదండి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మా నం చేయడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. లక్షా 9 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చేవే అయినప్పుడు.. తెలంగాణకు పైసా ఇవ్వలేదని ఎ లా తీర్మానం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొ త్తం రూ.2 లక్షల 91వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో నిధు లు, అప్పుల రూపేణా కేంద్రం రూ.లక్షా 9వేల కోట్ల నిధులిస్తోందని గుర్తుచేశారు. విభజన చట్టం హామీలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని బదనాం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్‌లో చేరి్పస్తా.. చదుకుంటావా?
‘హాస్టల్‌లో చేర్పిస్తా.. ఉన్నత చదువులు చదువుకుంటావా’అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓ బాలికను ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చర్లపల్లి గ్రామ సమీపం నుంచి ఆయన వెళుతుండగా పొలంలో నాట్లు వేస్తున్న కూలీలు కనిపించగానే తన కాన్వాయ్ ఆపేశారు. కారులోంచి దిగి కూలీల వద్దకు వెళ్లి వారితో కాసేపు మాట్లాడాడు. ఇందులో పదో తరగతి వరకు చదివి కూలీ పనులు చేస్తున్న బాలిక బోళ్ల అక్షయ గురించి ఆరా తీశారు.
‘నీకు చదువు ఇష్టం లేదా?’అని ప్రశ్నించారు. తమ కుటుంబ పరిస్థితి బాగోలేక కూలి పనులు చేయాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆయన అక్కడే ఉన్న బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పిలిచి.. బాలికను కాలేజీలో చేరి్పంచాలని సూచించారు. అవసరమైతే హాస్టల్‌లో చేర్పించి మంచి విద్య అందేలా చూడాలని చెప్పారు. దీంతో అక్షయ.. బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment