హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ ను జూన్ 9 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్‌డౌన్ కాలంలో సడలింపుల సమయాన్ని మరో మూడు గంటలు ఎక్కువగా పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు సడలింపులు ఇచ్చింది. బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చేయాలంటూ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది.
గతంలో బ్యాంక్ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాలు జూన్ 9 వరకు అమల్లో ఉండనున్నాయి.
చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment