ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరుబాట | BJP fights over grain purchases: Telangana | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరుబాట

Published Sat, Nov 9 2024 2:21 AM | Last Updated on Sat, Nov 9 2024 2:21 AM

BJP fights over grain purchases: Telangana

నేటి నుంచి 13వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాల సందర్శన

సాక్షి, హైదరాబాద్‌: రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు పోరాటానికి సిద్ధమయ్యారు. శనివారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లి గ్రామంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో డా. లక్ష్మణ్‌ , బంగారు శ్రుతి, సంకినేని వెంకటేశ్వరరావు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌బాబు పర్యటించనున్నారు.

 11వ తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బండి సంజయ్, బోడిగె శోభ, జి.మనోహర్‌రెడ్డి, రాణీ రుద్రమ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీకే అరుణ, మాజీఎంపీ పి.రాములు, చింతల రామచంద్రారెడ్డి.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ బీబీపాటిల్, జె.సంగప్ప, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాటిపట్టి వెంకటరమణారెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి దాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తారు. 13న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, సూర్యనారాయణగుప్తా, డి.ప్రదీప్‌కుమార్‌ ఇతర నేతలు పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement