తెలంగాణ అసెంబ్లీ దగ్గర ప్రమాదం | Car Fire Accident At Telangana Assembly Gate | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ప్రమాదం

Published Sat, Mar 12 2022 1:59 PM | Last Updated on Sat, Mar 12 2022 2:03 PM

Car Fire Accident At Telangana Assembly Gate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఘోర ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం అసెంబ్లీ గేటు 1 దగ్గర కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటల్ని వెంటనే ఆర్పేశారు.

ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం అసెంబ్లీ గేట్‌ దగ్గర ఉన్న ఐ 20 కార్ ఇంజన్‌లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు స్పందించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement