సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సరూర్ నగర్ పోలీస్ స్టే కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అర్వింద్ తెలంగాణ ప్రభుత్వంపై , సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్‌ఎస్ లీగల్ సెల్ కో కన్వీనర్, లాయర్ రవికుమార్ ఈనెల 17న సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టను కించపరిచే విదంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లీగల్ ఓపీనియన్‌కు పంపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు బుధవారం ధర్మపురి అరవింద్‌పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సరూర్ నగర్ ఇన్‌స్పెక్టర్ సీతారాం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment