సాక్షి, వరంగల్: ‘‘ధైర్యంగా ఉండమ్మా.. ఇంకా మనం ఉద్యమాలు చేయాలె.. టీఆర్‌ఎస్‌లో ఇంకా బాగా పనిచేయాలె.. త్వరలో హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతా..’’అని మాజీ నక్సలైట్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు పురి స్వరూప అలియాస్ సంధ్యకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఏటూరునాగారంలో సమీక్ష పూర్తిచేసుకుని హనుమకొండకు బయలుదేరుతున్న సమయంలో.. స్వరూప సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అది చూసిన సీఎం ఆమెను బస్సులోకి పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం స్వరూప మీడియాతో మాట్లాడారు.
‘‘మాది తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చిన్నవయసులోనే మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయాను. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు అమ్మనాన్న ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నాను. సార్ నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతానని హామీ ఇచ్చారు..’’అని వివరించారు.
చదవండి: (CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment