సాక్షి, ములుగు: ఏటూరునాగారం సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అని ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌శెట్టిని ప్రశ్నించారు. ‘‘అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం, బ్రిడ్జి కట్టనీయం, కరెంట్ పోల్ వేయనీయం అనడం మంచిదికాదు. శాపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? రోడ్డు సౌకర్యం లేక రేషన్ ఇవ్వలేక కలెక్టర్, ప్రజలు చావాలా? వెరీ సారీ.. ఇది మంచి పద్ధతి కాదు’’ అని మండిపడ్డారు.
చదవండి: (ఇంకా ఉద్యమాలు చేయాలె.. మాజీ మహిళా నక్సలైట్‌తో సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment