సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్రచవాన్ తదితరులు
మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర–తెలంగాణ మధ్య నిర్మిస్తున్న లెండి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్రచవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్‌రావు పాటిల్ నేతృత్వంలోని ఆ పార్టీ బృందం గురువారం సచివాలయంలో ఉత్తమ్‌ను కలవగా, ఈ మేరకు హామీ ఇచ్చారు.
1984లో రూ.2183.88 కోట్ల అంచనావ్యయంతో నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో 38,573 ఎకరాలు, మహారాష్ట్రలో 27,710 ఎకరాలు సాగులోకి వచ్చేది. రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఈ ప్రాజెక్ట్‌పై రూ.1040.87 కోట్లు ఖర్చు చేసి ఎర్త్ డ్యామ్ పనులు 70%, స్పిల్‌వే పనులు 80% పూర్తి చేయగా, కాల్వల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. పైపుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. భూనిర్వాసితులు అడ్డు పడడంతో 2011లో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను తిరిగి పునరుద్ధరించడంతోపాటు నదీగర్భంలోని మట్టి పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment