శాసనమండలిలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు | Telangana Congress MLC Vijayashanti Urges Govt To Fulfill Promises To Telangana Movement Activists, Watch Video Inside | Sakshi
Sakshi News home page

శాసనమండలిలో విజయశాంతి కీలక వ్యాఖ్యలు

Mar 30 2026 8:51 PM | Updated on Mar 31 2026 4:39 PM

Congress MLC Vijayashanti Key Comments

హైదరాబాద్‌:  తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అసలు ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అని ప్రశ్నించారు. ఉద్యమ కారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యమకారులను పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు.

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement