
డొంకలాంటి ఈ ప్రాంతంలో మూడేళ్ల కుమారుడితో ఇంటి సామాను ముందు కూర్చున్న ఈమె పేరు దీప. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓంకార్‌తో 2013లో వివాహమైంది. కొన్నాళ్లు.. కట్నంగా ఇచ్చిన భూమి తన పేరున రాసివ్వలేదని.. మరికొన్నాళ్లు అనుమానంతోనూ వేధించేవాడు. ఒకసారి ఈ వేధింపులపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దీప రెండు నెలల గర్భిణి.
ఈ క్రమంలో ఈ నెల 3న ఓంకార్ తాగొచ్చి కత్తితో బెదిరించాడు. సర్దిచెప్పడానికి వచ్చిన ఆమె తండ్రి, సోదరుడిపై చెప్పుతో దాడిచేశాడు. అంతేగాకుండా శనివారం ఇంట్లోని సామానంతా కట్నంగా రాసిచ్చిన భూమిలో పడేసి వెళ్లిపోయాడని, అందుకే అక్కడే కూర్చుని న్యాయం కోసం ఆందోళనకు దిగినట్టు దీప వివరించింది. కాగా, పోలీసులు దంపతులిద్దరినీ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.(చదవండి: తనిఖీలు చేస్తున్నారని భార్యను వదిలేసి భర్త పరార్)
– కమలాపూర్
Comments
Please login to add a commentAdd a comment