సాక్షి, హైదరాబాద్: దూరవిద్య (ఓపెన్)లో టెన్త్, ఇంటర్ చదివిన అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్‌లో ‘ఓపెన్’కు సంబంధించిన ఆప్షన్ కనిపించకపోవడంతో ఈ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కష్టమైపోయింది. అభ్యర్థి ఆధార్ కార్డు వివరాలతో వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది.
కానీ దూరవిద్యలో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాలలో, కళాశాలలో చదివిన నేపథ్యం లేకపోవడంతో నిర్దేశించిన ఆప్షన్లను పూరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓటీఆర్ ప్రక్రియలో ముందుకు సాగలేకపోతున్నారు. నోటిఫికేషన్లు వెలువడితే ఓటీఆర్ లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు ఓపెన్ అభ్యర్థులూ ఓటీఆర్‌కు అర్హులేనని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల నమోదు సమయంలో వచ్చే పేజీని కొనసాగిస్తే సరిపోతుందంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ సాగట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు.
(చదవండి: TSPSC: గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే! నేడో, రేపో..)
Comments
Please login to add a commentAdd a comment