‘నాకు సిద్దిపేటలో కేసీఆర్ నగర్‌లో అధికారులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండ్రు. నేను నా కూతురు ఇద్దరం.. మా తమ్ముడి వద్ద ఉంటున్నం. రేపోమాపో నా కూతురికి పెళ్లయి వెళ్లిపోతది. తర్వాత ఒంటరిగా ఉండే నాకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అవసరం ఉండదు. నాకు వచ్చిన ఆ ఇంటిని అధికారులకు తిరిగిస్తున్నా. నా లాంటి పేదవారికి దాన్ని ఇవ్వండి. ఇదీ ఈ పేదింటి మహిళ గొప్ప మనసు..
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట కేసీఆర్ నగర్‌లోని ఆడిటోరియంలో లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన రచ్చ లక్ష్మి తన కూతురు, తమ్ముడితో కలసి వేదికపైకి వచ్చింది. తన భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడని.. కొంతకాలంగా కూతురుతో కలసి తమ్ముడు నగేష్ వద్ద ఉంటున్నా మని తెలిపింది. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని వెనక్కి ఇస్తున్నట్లు మంత్రికి వివరించింది. మరో పేదరాలికి ఆ ఇంటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇంటి ధ్రువీకరణ పత్రాలు, తాళం చెవిని మంత్రి హరీశ్ సమక్షంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించింది. లక్ష్మి నిర్ణయాన్ని మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment