సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం | Earthquake of 3.1 magnitude reported in Suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం

Published Mon, Feb 20 2023 11:21 AM | Last Updated on Mon, Feb 20 2023 3:20 PM

Earthquake of 3.1 magnitude reported in Suryapet - Sakshi

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లాలో ఆదివారం స్వల్ప భూకంపం వచ్చింది. చింతలపాలెం మండలంలోని తమ్మారం, వెల్లటూరు, చింతలపాలెం, గుడిమల్కాపురం, దొండపాడు, వజినేపల్లి తదితర గ్రామాలతో పాటు మేళ్లచెరువు మండలంలో ఉదయం 7.30 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత సుమారు 3.1 మాగ్నిటూడ్‌గా నమోదైనట్లు తెలిసింది. గతంలో 2020, జనవరి మొదటి వారంలో 4 మాగ్నిటూడ్‌గా నమోదైంది. 2022లో కూడా పలు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ నేపథ్యంలో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement