
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపధ్యంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్‌సి) పరీక్షల కోసం ప్రిపేరవుతున్న విద్యార్ధులకు ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ యుఫేబర్ చేయూతని అందిస్తోంది. దీనిలో భాగంగా దాదాపు 5 వేల మందికి ఉచితంగా కోర్సులను అందించనుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌తో పాటు నిపుణులతో కౌన్సిలింగ్, దఫాల వారీ టెస్టులు.. వీటన్నింటితో మేళవించిన తమ యుపీఎస్‌సీ ప్రిలిమ్స్ కోర్సులకు సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా వీరికి శిక్షణ అందించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలచినవారు యూపీఎస్‌సీ పాఠశాల డాట్‌కామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.