తెలంగాణ బోర్డర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి | 3 Maoists Killed In Encounter At Telangana-Chhattisgarh Border | Sakshi
Sakshi News home page

తెలంగాణ బోర్డర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Published Sat, Apr 6 2024 9:18 AM | Last Updated on Sat, Apr 6 2024 9:38 AM

Encounter At Telangana And Chhattisgarh Border - Sakshi

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఒక ఏకే-47 గన్‌, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

వివరాల ప్రకారం. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అనంతరం, ఘటనా స్థలంలో ఏకే-47 సహా మరో మూడు తుపాకులను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement