
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 2010లో ఉమ్మడి ఏపీలో సీఎస్‌గా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎస్వీ ప్రసాద్ విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం:
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎస్వీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్ తనదైన ముద్ర వేశారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి సంతాపం:
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చదవండి: కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతి: బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment