మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు | EX Minister laxma Reddy Controversial Comments In Mahabubnagar | Sakshi
Sakshi News home page

'జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుంది..'

Published Tue, Dec 15 2020 2:18 PM | Last Updated on Tue, Dec 15 2020 5:52 PM

EX Minister laxma Reddy Controversial Comments In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'24 గంటల ఉచిత కరెంటు కాకుండా కేవలం 3,4 గంటల కరెంటు ఇవ్వాలని కోరుతానని వెల్లడించారు. మేము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడంలేదు. జనం మంచివారనలా.. అమాయకులనాలో తెలియడంలేదు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది' అంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఏ ఏటికాయేడు అయితేనే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement