
సాక్షి, మహబూబ్‌నగర్: అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వీరారెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరారెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.