పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు | Farmers are allowed to set up 4 thousand MW plants | Sakshi
Sakshi News home page

పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు

Published Fri, Aug 30 2024 3:14 AM | Last Updated on Fri, Aug 30 2024 3:14 AM

Farmers are allowed to set up 4 thousand MW plants

రైతులు 4 వేల మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి

పీఎం–కుసుం పథకం కింద కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయనున్న డిస్కంలు

యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.13 చెల్లించనున్న విద్యుత్‌ సంస్థలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం–కుసుమ్‌) పథకం కింద రైతులు/రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ పథకంలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అన్ని రాష్ట్రాలకు కలిపి ఇప్పటివరకు 8,112 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం అనుమతి ఇవ్వగా, అందులో అత్యధికంగా 4 వేల మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రా నికి సంబంధించినవే కావడం గమనార్హం. రైతులు వ్యక్తిగ తంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగా వాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న సోలా ర్‌ పవర్‌ ప్లాంట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. 

రెన్యువబుల్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్పీవో) నిబంధనల ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏటా తప్పనిసరిగా కొంత శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్లాంట్‌ల ద్వా రా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కూడా ఆర్పీఓ నిబంధనల కింద డిస్కంలు తప్పనిసరిగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లించనున్నాయి.  రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు 0.40 పైసలు చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరు త్పాదక ఇంధన శాఖ  ప్రోత్సాహకంగా అందించనుంది.

త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం..
డిస్కంలు తమ 33/11 కేవీ, 66/11 కేవీ, 110/11 కేవీ సబ్‌ స్టేషన్ల వారీగా వాటి పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టేందుకు అవకాశం ఉందో గుర్తించి తమ వెబ్‌సైట్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తైంది. త్వరలో  రైతుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ డిస్కంలు ప్రకటన జారీ చేయనున్నాయి. 

ఆసక్తి గల రైతులు/డెవలపర్లు మెగావాట్‌కు రూ.,5000కి మించకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రైతులు/డెవలపర్లు కుదుర్చుకునే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఆధారంగా రైతులు/డెవలపర్లకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement