![Fire broke out at fireworks shop in Hyd](/styles/webp/s3/article_images/2024/10/28/1455.jpg.webp?itok=8fhf0QdU)
కాలిపోయిన పది ద్విచక్ర వాహనాలు
దట్టమైన పొగతో ఇద్దరు మహిళలకు అస్వస్థత
సుల్తాన్‌బజార్: బొగ్గులకుంటలోని పరస్ ఫైర్‌వర్క్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్రాకర్స్‌కు నిప్పు అంటుకుని భారీ శబ్దాలు రావడం, మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు.
దట్టమైన పొగతో అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బొగ్గులకుంట చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. దు కాణం పక్కన ఉన్న బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న తాజా టిఫిన్ సెంటర్‌కు సైతం మంటలు వ్యాపించాయి. గౌలిగూడ ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని అగి్నమాపక బృందం మంటలను ఆరి్పంది. క్రాకర్స్ కొనుగులుదారుల వాహనాలు కూడా అగ్నికి ఆహుతి కావడం ఆందోళనకు కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment