నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యం(కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ సస్పెండ్ అయ్యారు. ఈ కేజీబీవీలో నాసిరకం భోజనం తిని విద్యార్థినులు ఆదివారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. సోమవారం కూడా కిచిడీలో వెంట్రుకలు, అన్నం, పప్పులో పురు గులు, వెంట్రుకలు వచ్చాయి.
ఆది వారం జరిగిన సంఘటన మర్చిపోక ముందే మళ్లీ ఇలా జరగడంతో పాఠశా లకు విచ్చేసిన పలువురు ఇదేంటని మండిపడ్డారు. పాఠశాలలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి కొంతమంది విద్యార్థిను లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఈవో ప్రణీత అక్కడికి చేరుకుని జయశ్రీని సస్పెండ్ చేయడంతో పాటు వంట నిర్వాహకులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే పాఠశాలలో 248 మంది విద్యార్థినులుండగా ఇలా జరగడంతో పలువురు ఇంటిబాట పట్టారు. సోమవారం రాత్రి వరకు 72 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment