
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ కేఎస్‌ఎన్ మూర్తి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్‌తో బాధపడుతున్నారు. ఆదివా రం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. డీఎస్పీగా పోలీసుశాఖలో చేరిన మూర్తి హైదరాబాద్ పోలీసు విభాగంపై తనదైన ముద్ర వేశారు.
ఐపీఎస్ హోదా పొందిన తర్వాత ఆయన నగర పోలీసు విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. హైదరాబాద్‌లో 1991–92లో జరిగిన మత ఘర్షణలను అణచివేయడంతోపాటు రౌడీషీటర్లకు తనదైన శైలిలో చెక్ చెప్పారు. మూర్తి పనితీరును చూసిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు గబ్బర్‌సింగ్ అని పేరు పెట్టారు. సిటీ కమిషనరేట్ పరిధిలో సిట్‌ల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు.
చదవండి: కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్