Ganesh Immersion: కీలక ఘట్టానికి వేళాయే | Ganesh immersion preparations in full swing in Hyderabad | Sakshi
Sakshi News home page

Ganesh Immersion: కీలక ఘట్టానికి వేళాయే

Published Mon, Sep 16 2024 8:17 AM | Last Updated on Mon, Sep 16 2024 10:08 AM

Ganesh immersion preparations in full swing in Hyderabad

నగర వ్యాప్తంగా  66 ప్రాంతాల్లో అమలు 

ఖాళీ వాహనాలు వెళ్లేందుకూఓ మార్గం 

సందర్శకుల కోసం  పార్కింగ్‌ ఏర్పాట్లు 

ఉత్తర్వులు జారీ చేసిన కొత్వాల్‌ ఆనంద్‌

సాక్షి,హైదరాబాద్: గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి. వీటి కారణంగా నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం నిమజ్జనం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచి్చన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.   

ప్రధాన ఊరేగింపు మార్గం: కేశవగిరి–నాగుల్‌చింత–ఫలక్‌నుమా– చార్మినార్ – మదీనా–  అఫ్జల్‌గంజ్‌–ఎంజే మార్కెట్‌–అబిడ్స్‌–బïÙర్‌బాగ్‌–లిబరీ్ట–అప్పర్‌ ట్యాంక్‌/ఎనీ్టఆర్‌ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. 

సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చేది: ఆర్పీ రోడ్‌–ఎంజీ రోడ్‌–కర్బలా మైదాన్‌–ముషిరాబాద్‌ చౌరస్తా–ఆరీ్టసీ క్రాస్‌రోడ్స్‌– నారాయణగూడ ‘ఎక్స్‌’ రోడ్‌–హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్‌ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. 

ఈస్ట్‌జోన్‌ నుంచి వచ్చేది: ఉప్పల్‌–రామంతాపూర్‌–అంబర్‌పేట్‌–ఓయూ ఎన్‌సీసీ–డీడీ హాస్పిటల్‌ మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద సికింద్రాబాద్‌ రూట్‌లో కలుస్తుంది. 

👉  వెస్ట్‌ జోన్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్‌ లేదా సెక్రటేరియేట్‌ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. 
👉   నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్‌ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్‌ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. 
👉 వెస్ట్‌–ఈస్ట్‌ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్‌ వద్దే అవకాశం ఉంటుంది.  
👉 వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్‌రోడ్, బేగంపేట్‌ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.  
ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్స్‌  
👉సౌత్‌ జోన్‌: కేశవగిరి, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్స్, ఇంజన్‌ బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్‌íÙఫా చౌరస్తా, సిటీ కాలేజీ. 
👉 ఈస్ట్‌ జోన్‌: చంచల్‌గూడ జైల్‌ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జ్, సాలార్జంగ్‌ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లి»ౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్‌ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌. 
👉 వెస్ట్‌ జోన్‌: టోపీఖానా మాస్‌్క, అలాస్కా హోటల్‌ చౌరస్తా, ఉస్మాన్‌ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్‌ ఐలాండ్, బర్తన్‌ బజార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ 
👉 సెంట్రల్‌ జోన్‌: ఛాపెల్‌ రోడ్‌ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్‌ సెంటర్, శాలిమార్‌ థియేటర్, గన్‌ ఫౌండ్రీ, స్కౌలైన్‌ రోడ్‌ ఎంట్రీ, హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గౌడ్స్‌ చౌరస్తా, కంట్రోల్‌రూమ్‌ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్‌ ఆఫీస్‌ ‘వై’ జంక్షన్, బీఆర్‌కే భవన్, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్‌ చౌరస్తా, వీవీ స్టాచ్యూ చౌరస్తా, చి్రల్డన్స్‌ పార్క్, వైశ్రాయ్‌ హోటల్‌ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్‌ 
👉 నార్త్‌జోన్‌: కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్‌ క్లబ్, సెయిలింగ్‌ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్‌ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్‌’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. 

సందర్శకులకు పార్కింగ్‌ 
హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు. అవి... ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్‌ మధ్య, బుద్ధ భవన్‌ పక్కన, ఎనీ్టఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్స్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్‌. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు చేరుకోవాలి. 

నిమజ్జనం తర్వాత: విగ్రహాలను తెచి్చన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం చేసినవి నెక్లెస్‌రోటరీ, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్, వీవీ స్టాచ్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాచ్యూ, మింట్‌ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చి్రల్డన్స్‌పార్క్, డీబీఆర్‌ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్‌ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్‌ రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి మీదుగా అనుమతించరు.  

ఇంటర్‌ డి్రస్టిక్ట్‌/స్టేట్‌ లారీలకు నో: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్‌ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది.  

ఆర్టీసీ బస్సులకూ: ట్రాఫిక్‌ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాచ్యూ, సీటీఓ, వైఎంసీఏ, రెతిఫైల్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, క్లాక్‌ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, నల్గొండ చౌరస్తాలను దాటి ముందుకు రానీయరు.  

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు: నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్లిస్తారు.

రేపు అర్ధరాత్రి వరకు మెట్రో 
వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ  ఎన్వీఎస్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. వివిధ కారిడార్‌లలో ఒంటిగంటకు బయలుదేరే రైళ్లు  తెల్లవారుజామున 2 గంటలకు చివరి స్టేషన్‌లకు చేరుకొంటాయని చెప్పారు. ప్రయాణికుల  రద్దీకనుగుణంగా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్‌ స్టేషన్‌లలో అదనపు టికెట్‌ కౌంటర్‌లకు  ఏర్పాటు చేయనున్నట్లు  పేర్కొన్నారు. ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని, మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు  గత కొద్ది రోజులుగా ఖైరతాబాద్‌ వినాయక విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. 

ప్రతిరోజూ  5 లక్షల మందికి పైగా  ప్రయాణికులు వివిధ మార్గాల్లో  రాకపోకలు సాగిస్తున్నారు. శనివారం ఒక్కరోజే సుమారు 9,4000 మంది  ఖైరతాబాద్‌ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చినట్లు ఎండీ పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని  ఎల్‌అండ్‌టీ అధికారులతో ఆదివారం ఎన్వీఎస్ సమావేశమయ్యారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా అదనపు సరీ్వసులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు చొప్పున అందుబాటులో ఉండగా, వివిధ స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు  మెట్రో సదుపాయం కల్పించేందుకు అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  

హెల్ప్‌లైన్‌ల ఏర్పాటు 
ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 04027852482, 87126 60600, 
90102 03626
నెంబర్లలో
సంప్రదించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement