Ganesh immersion at Tankbund
-
Ganesh Nimajjanam: హుస్సేన్‌సాగర్‌లో లక్ష విగ్రహాలు
ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందే పూర్తి చేశామని, సోమవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఫ్రీ చేయగలిగామని, ఇదంతా ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్లే సాధ్యమైందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లో కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో హుస్సేన్ సాగర్‌లో ఒక్కరోజే 15 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని తెలిపారు. మొత్తం 11 రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో లక్ష విగ్రహాలు నిమజ్జనం చేశారన్నారు. ఇంకా మిగిలి ఉన్న విగ్రహాలను ప్రణాళిక ప్రకారం నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.40కి పూర్తిచేశాం..ఇందుకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో చత్రినాక, సంతోష్ నగర్, మాదన్నపేటలకు చెందిన నిర్వాహకులు ముందుకొచ్చి విగ్రహాలను త్వరగా తరలించారన్నారు. ఈస్ట్‌జోన్, సౌత్ జోన్ల పరిధిలో మండప నిర్వాహకులు ఎంత చెప్పినా ముందుకు రాలేదని, అందుకే ఆలస్యమవుతుందన్నారు. ఇష్టమొచి్చనట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచైనా మండప నిర్వాహకులు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకొని పోలీసులకు, జీహెచ్ఎంసీకి సహకరిచాలన్నారు. అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య రెండు భారీ వినాయక విగ్రహాలు ఇరుక్కుపోవడం వల్ల కొంత ఆలస్యమైందని, ఓల్డ్ సిటీ, ఆబిడ్స్ మెయిన్ రోడ్లలో వాహనాలు బ్రేక్ డౌన్ కావడం 4–5 గంటల ఆలస్యానికి కారణమైందన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ట్రాన్స్‌కో, ఆర్టీఏ సిబ్బంది, అధికారులు 40 గంటల పాటు నిద్రాహారాలు మాని పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే గొడవలు చాలా తగ్గాయని, చిన్న చిన్న గొడవలు జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచి్చన వెంటనే పరిష్కరించామని తెలిపారు. మొదటి ఫేజ్, రెండవ ఫేజ్‌లలో కలిపి సిటీ పోలీసులు 15 వేల మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది మొత్తం 25 వేల మంది పోలీసులు నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. మొత్తం మీద నిమజ్జనోత్సవాలను సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నానని నగర సీపీ తెలిపారు. -
Ganesh Immersion: కీలక ఘట్టానికి వేళాయే
సాక్షి,హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి. వీటి కారణంగా నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం నిమజ్జనం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచి్చన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం: కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమా– చార్మినార్ – మదీనా– అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బïÙర్‌బాగ్–లిబరీ్ట–అప్పర్ ట్యాంక్/ఎనీ్టఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది: ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బలా మైదాన్–ముషిరాబాద్ చౌరస్తా–ఆరీ్టసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేది: ఉప్పల్–రామంతాపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్లో కలుస్తుంది. 👉 వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. 👉 నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. 👉 వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. 👉 వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ 👉సౌత్ జోన్: కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్íÙఫా చౌరస్తా, సిటీ కాలేజీ. 👉 ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్, పుత్లి»ౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్. 👉 వెస్ట్ జోన్: టోపీఖానా మాస్్క, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 👉 సెంట్రల్ జోన్: ఛాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కౌలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాచ్యూ చౌరస్తా, చి్రల్డన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్ 👉 నార్త్‌జోన్: కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. సందర్శకులకు పార్కింగ్ హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి... ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎనీ్టఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తర్వాత: విగ్రహాలను తెచి్చన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం చేసినవి నెక్లెస్‌రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాచ్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాచ్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చి్రల్డన్స్పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జి మీదుగా అనుమతించరు. ఇంటర్ డి్రస్టిక్ట్/స్టేట్ లారీలకు నో: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ: ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాచ్యూ, సీటీఓ, వైఎంసీఏ, రెతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, నల్గొండ చౌరస్తాలను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు: నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్లిస్తారు.రేపు అర్ధరాత్రి వరకు మెట్రో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం తెలిపారు. వివిధ కారిడార్లలో ఒంటిగంటకు బయలుదేరే రైళ్లు తెల్లవారుజామున 2 గంటలకు చివరి స్టేషన్లకు చేరుకొంటాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లకు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని, మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతిరోజూ 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. శనివారం ఒక్కరోజే సుమారు 9,4000 మంది ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చినట్లు ఎండీ పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎల్అండ్టీ అధికారులతో ఆదివారం ఎన్వీఎస్ సమావేశమయ్యారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా అదనపు సరీ్వసులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు చొప్పున అందుబాటులో ఉండగా, వివిధ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మెట్రో సదుపాయం కల్పించేందుకు అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హెల్ప్లైన్ల ఏర్పాటు ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్లైన్లను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 04027852482, 87126 60600, 90102 03626నెంబర్లలోసంప్రదించవచ్చు. -
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్‌లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్‌లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కాలేదు. -
గణేష్ నిమజ్జనాలపై సీవీ ఆనంద్ కీలక ప్రెస్ మీట్
-
దర్శనాలకు బ్రేక్.. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు
-
ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తున్న గణనాథులు
-
భాగ్యనగరంలో మహాజాతర
-
ట్యాంక్ బండ్ పై రేపు వాహన రాకపోకలు బంద్
-
ప్రగతిభవన్ లోనే విగ్రహాల నిమజ్జనం చేస్తాం : బండి సంజయ్
-
ముగిసిన బడా గణేష్ శోభాయత్ర.. గంగను చేరిన గౌరీ తనయుడు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేషుని శోభాయాత్ర ముగిసింది. 9 రోజులపాటు పూజలందుకున్న పంచముఖ మహా రుద్ర గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌పైకి తరలించారు. శోభాయాత్రలో పాల్గొని భక్త జన సందోహం పులకించి పోయింది. బొజ్జ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం 40 అడుగుల ఎత్తు.. 28 టన్నుల బరువున్న గణ నాథుని విగ్రహం గంగమ్మ ఒడికి చేరింది. ఉదయం 7 గంటలకు మొదలైన 2.5 కిలోమీటర్ల శోభాయత్ర దాదాపు 8 గంటలపాటు కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. చదవండి: Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే గంగమ్మ ఒడికి గణనాథుడు సాయంత్రం 3.20 గంటలు ► ఖైరతాబాద్ పంచముఖ మహా రుద్ర గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. క్రేన్ నెంబర్ 4 నుంచి గౌరీ తనయుని విగ్రహాన్ని నిర్వాహకుల సమక్షంలో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 1.50 గంటలు ► ఖైరతాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్‌లోకి చేరుకుంది. కాసేపట్లో క్రేన్ నెంబర్ 4లో మహా గణపయ్య నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటలు ► ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. ఉదయం 10.00 గంటలు ► ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకున్న మహాగణపతి ► టెలిఫోన్ భవన్ చేరుకోవడానికి ఇంకా గంటన్నర పట్టే అవకాశం ► పోలీసులు తొందరపెడుతున్నా.. నెమ్మదిగా వెళ్తామంటున్న ఉత్సవ సమితి గణేష్ నిమజ్జనంపై డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు కలగుండా ప్రశాంతంగా నిమజ్జనం జరగాలని అధికారులకు డిజీపీ అదేశాలు జారీచేశారు. గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు -
గణేష్ నిమజ్జనం : అప్ డేట్స్
సాక్షి, హైదరాబాద్ : బొజ్జగణపయ్య నిమజ్జన పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. జై భోలో గణేష్ మహరాజ్ కీ... జై అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. బాలాపూర్ శోభా యాత్ర మంగళవారం రాత్రి 9గంటలకు పాత బస్తీ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ హుస్సేన్ సాగర్‌లో వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి నడిబొడ్డులోని హుస్సేన్ సాగర్‌కు గణనాధుల వాహన శ్రేణులు మంగళవారం రాత్రి దాటిన తర్వాత కూడా ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే గణనాధుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎటుచూసినా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అశేషమైన భక్తజన సందోహం నడుమ మంగళవారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌లోని క్రేన్ నం-4వద్ద ఖైరతాబాద్ మహా వినాయకుడు, క్రేన్ నం-8 వద్ద సాయంత్రం బాలాపూర్ గణేష్ గంగమ్మ ఒడికి చేరారు. పూర్తి అప్డేట్స్ ఇవి.. ♦ మధ్యాహ్నం 1.45 గంటలకు.. మహా గణపతి నిమజ్జనం పూర్తి ముందుగా అనుకున్నట్లే మధ్యాహ్నం 12 గంటల కల్లా గణనాథుని నిమజ్జనం పూర్తవుతుందని భావించినా... మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో మహా గణపతి గంగమ్మ ఒడిలో చేరాడు. మరోవైపు నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు. ♦ సాయంత్రం 6.12 గంటలు..క్రేజ్ నం-8 వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం ♦7 గంటల పాటు సాగిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ♦వినాయక నిమజ్జనంలో అపశ్రుతి ♦పీపుల్స్ ప్లాజా వద్ద సెల్ఫీ తీసుకుంటూ నీటిలో పడ్డ యువకుడు ♦యువకుడి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు ♦ సాయంత్రం 5.29 గంటలు..నిమజ్జనం ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఏరియల్ సర్వే ♦ సాయంత్రం 5.21 గంటలు.. ట్యాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ వినాయకుడు ♦ సాయంత్రం 5.15 గంటలు.. ఇప్పటివరకూ 664 విగ్రహాలు నిమజ్జనం ♦ సాయంత్రం 4.52 గంటలు.. వినాయక విగ్రహాల నిమజ్జనానికి నృత్యాలు, కోలాటాలతో ట్యాంక్ బండ్‌కు తరలి వస్తున్న భక్తులు ♦ మధ్యాహ్నం 3.51 గంటలు చార్మినార్ లో శోభాయాత్రను పరిశీలించిన డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, అందరు సహకరించాలి: డీజీపీ, సీపీ ♦మధ్యాహ్నం 3.49 గంటలు రూ.3.66 లక్షలు పలికిన కూకట్పల్లి గణేష్ లడ్డు లడ్డును దక్కించుకున్న బీజేపీన నేత నరేందర్ ♦ మధ్యాహ్నం 03.15 గంటలు చార్మినార్ దాటిన బాలాపూర్ గణేషుడు ♦ మధ్యాహ్నం 01.50 గంటలు మూసాపేటలో నిమజ్జనానికి బయల్దేరిన 30 అడుగుల మట్టి గణపతి ♦ మధ్యాహ్నం 01.49 గంటలు చార్మినార్ వద్దకు చేరిన శోభాయాత్ర ♦ మధ్యాహ్నం 01.48 గంటలు పాతబస్తీలోకి ప్రవేశించిన బాలాపూర్ వినాయకుడు ♦ మధ్యాహ్నం 01.47 గంటలు చార్మినార్ చేరుకున్న అలియాబాద్ గణేషుడు ♦ మధ్యాహ్నం 01.40 గంటలు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. క్రేన్-4 వద్ద ఏర్పాట్లు ♦ మధ్యాహ్నం 01.45 గంటలు ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తి ప్రారంభమైన శోభాయాత్ర.. ♦ ఉదయం 04.30 గంటలు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది.. ♦ ఉదయం 05:00 గంటలు ఖైరతాబాద్ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ♦ ఉదయం 08:00 గంటలు మండపం నుంచి బయల్దేరిన ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపు ప్రస్తుతం లక్డీకపూల్‌కు వెళ్లే దారి వద్దకు చేరుకుంది. ♦ ఉదయం 08:30 గంటలు ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావడం జనసందోహం కొంచెం తక్కువగా ఉంది. దీంతో గణేశుడి విగ్రహాల ఊరేగింపు కూడా వేగంగా జరుగుతోంది. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం కూడా అనుకున్న సమయాని కంటే ముందే జరగొచ్చని భావిస్తున్నారు. ♦ ఉదయం 09:00 గంటలు ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది. తెలుగు తల్లి ఫై ఓవర్ పక్క నుంచి నక్లెస్ రోడ్ వద్దకు ఊరేగింపు వెళ్లనుంది. ♦ ఉదయం 09.12 గంటలు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర పూర్తి. లడ్డూ వేలం పాటకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు. ఇప్పటివరకూ లడ్డూలు గెల్చుకున్న 17 మందితో పాటు కొత్తగా మరో నలుగురికి వేలం పాటలో అవకాశం. ♦ ఉదయం 09.28 గంటలు సెక్రటరియేట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ అనంత మహాగణపతి ♦ ఉదయం 10.03 గంటలు ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట. ♦ ఉదయం 10.04 గంటలు బాలాపూర్ లడ్డూ దేవుడి పాట 1,116/- ♦ ఉదయం 10.06 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.8 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.07 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.25 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.60 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.14.95 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.08 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.15.05 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.09 గంటలు బాలాపూర్ లడ్డూ రూ.15.50 లక్షలకు చేరుకున్న వేలం. ♦ ఉదయం 10.09 గంటలు బాలాపూర్ లడ్డూను రూ.15.60 లక్షలకు వేలంలో దక్కించుకున్న నాగం తిరుపతి రెడ్డి. ♦ ఉదయం 10.52గంటలు ట్యాంక్ బండ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు. ♦ ఉదయం 11.37గంటలు కాసేపట్లో నాలుగో క్రేన్ వద్ద అనంత చండీ మహా గణపతి విగ్రహ నిమజ్జనం. క్రేన్‌ను నిమజ్జనానికి సిద్ధం చేసిన అధికారులు. నగరమంతా కోలాహలం... ♦ ఇప్పటికే మూడు, ఐదు, ఏడు రోజుల పూజలందుకున్న వినాయకుల నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి మహానగర వ్యాప్తంగా సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ సహా గ్రేటర్ నలుమూలలా ఏర్పాటుచేసిన 23 నిమజ్జన కొలనుల్లో పదివేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అంచనావేస్తున్నారు. మహానిమజ్జనానికి ఏర్పాట్లు ♦ జీహెచ్ఎంసీ, పోలీసు, హెచ్ఎండీఏ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖ, రవాణా, ఆర్టీసీ, రైల్వే, తదితర విభాగాలన్నీ రంగంలోకి దిగాయి. ♦ సామూహిక నిమజ్జన వేడుకలు జరుగనున్న ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ వైపు 18 క్రేన్లు, నెక్లెస్‌రోడ్డు వైపు 9 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ♦ బాలాపూర్ విగ్రహంతో బయలుదేరిన తరువాత ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని సైతం ఈ సారి ఉదయమే నిమజ్జనానికి తరలించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ రెండు విగ్రహాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ ట్యాంక్‌బండ్ వద్ద కలుస్తాయి. ♦ ఉదయం నుంచే విగ్రహాలు తరలిరానున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు. ♦ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ♦ గడిచిన మూడు రోజులుగా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో మంగళవారం సుమారు 10 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు..... ♦ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ♦ హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగేందుకు ఫ్లాట్‌ఫాంలను సిద్ధం చేశారు. ♦ పారిశుధ్య ఏర్పాట్లులో భాగంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్‌లలో పురుషులకు 20 తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, మహిళలకు 10 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ♦ 101 ప్రాంతాలలో కౌంటర్లు, టెంట్లు, మంచినీటి ప్యాకెట్లను వాటర్‌వర్క్స్ విభాగం సిద్ధం చేశారు. ♦ శోభాయాత్ర జరిగే మార్గంలో ప్రతి 3–4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 165 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒక శానిటరీ సూపర్వైజర్, శానిటరీ జవాన్, 21 మంది వర్కర్లు మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ♦ శోభాయాత్ర జరిగే ప్రధాన వీధుల్లో 354 కిలోమీటర్ల మేర ఈ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. గణేష్ యాక్షన్ టీమ్‌లలో మొత్తంగా పదివేల మంది సభ్యులుంటారని తెలిపింది. ♦ నిమజ్జనం కోసం 236 వివిధ రకాల వాహనాలను వినియోగించనుంది. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ వద్ద భారీ గణనాథుల నిమజ్జనానికి 27 భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. ♦ అనేక చోట్ల అదనంగా వీధి లైట్ల ఏర్పాటు. ♦ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక గజ ఈతగాళ్లను నియమించారు. ♦ గణేష్ నిమజ్జనం పూర్తయిన వెంటనే 14 స్వీపింగ్ మిషన్ల పరిశుభ్రత పనులు. నిమజ్జనం జరిగే ప్రాంతాలు 1. కాప్రాచెరువు, 2. సరూర్‌నగర్, 3. రాజన్నబావి, 4. మీరాలంట్యాంక్, 5. పల్లెచెర్వు, 6. పత్తికుంట చెరువు, 7. దుర్గం చెరువు, 8. మల్కం చెరువు, 9. గోపీనగర్ చెరువు, 10. పెద్దచెరువు, 12. గురునాథం చెరువు, 13. కాయిదమ్మకుంట, 14. ఈర్లచెరువు, 15. రాయసముద్రం చెరువు, 16. సాకిచెరువు, 17. ఐడీఎల్ ట్యాంక్, 18. ప్రగతినగర్ చెరువు, 19. హస్మత్‌పేట్ చెరువు, 20. సున్నం చెరువు, 21. పరికి చెరువు, 22. వెన్నెలగడ్డ చెరువు, 23. సూరారం చెరువు, హుస్సేన్ సాగర్ వద్ద.... ♦ ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటు. ♦ ప్రతి యాక్షన్ టీమ్‌లో ఒక శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21మంది పారిశుధ్య సిబ్బంది ఉంటారు. ♦ మొత్తం 388.5కిలోమీటర్ల విస్తీర్ణంలో 165 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ♦ 295మంది శానిటరీ సూపర్వైజర్లు, జవాన్లు, 688 మంది ఎస్ఎఫ్ఎలు, 9,710మంది పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక నియామకం. ♦ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 85 మంది స్విమ్మర్లు, డైవర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ వద్ద ఇద్దరు స్విమ్మర్లు ఉంటారు. ♦ చెరువుల వద్ద వెయ్యి మంది ఎంటమాలజి వర్కర్లు నియామకం. ♦ రూ. 1.05కోట్ల వ్యయంతో 236 వాహనాల ఏర్పాటు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు... ♦ నిమజ్జన సందర్భంగా ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ♦ నిమజ్జనం సందర్భంగా ప్రజలు తమ సమస్యలను చెప్పడానికి ప్రత్యేకంగా డయల్ 100, జీహెచ్ఎంసి కాల్ సెంటర్ నెంబర్ 040-21111111 లకు సంప్రదించవచ్చు. అలాగే ‘ మై జీహెచ్ఎంసి’ యాప్ ద్వారా సమస్యలను అధికారులకు వివరించవచ్చు. ♦ ప్రతి మూడు క్రేన్ల వద్ద షిఫ్టుల వారీగా పనిచేయడానికి 231 మంది ఎంటమాలజి సిబ్బందిని నియమించారు. ♦ నిమజ్జనం సందర్భంగా వెలువడే వ్యర్థాల తొలగింపునకు 25టన్నుల సామర్థ్యం గల 6 వాహనాలను సిద్ధం చేశారు. ♦ మరో 40 మినీ టిప్పర్లు, 6 ఫ్రంట్ ఎండ్ లోడర్లు, 4జె.సి.బిలు, 6 బాబ్కాట్లు, 20 స్మాల్ స్వీపింగ్ మిషన్లు, 6 బిగ్ స్వీపింగ్ మిషన్లను సిద్ధంగా ఉంచారు. జలాశయాల్లో కలిసే వ్యర్థాలు.... ♦ నిమజ్జనం సమయంలో హుస్సేన్‌సాగర్ సహా ఆయా నిమజ్జన కొలనుల్లో కలిసే రసాయన రంగుల అవశేషాలు : లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. ♦ హానికారక మూలకాలివే : కోబాల్ట్, మ్యాంగనీస్ డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. పర్యావరణ హిత నిమజ్జనానికి సూచనలు... ♦ జలాశయంలో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ♦ మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాలంలోకి ఆకులు, పూలు, కొబ్బరికాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను వేయొద్దు. ♦ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వ్యర్థాల తొలగింపునకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు... ♦ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి జీహెచ్ఎంసీ డంప్‌యార్డుకు తరలించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లుచేసింది. ఈ కృషిలో మూడు జేసీబీలు, 6 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇక వ్యర్థాల తొలగింపు పనుల్లో 480 మంది కూలీల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ టీంలు : సీసీ కెమరాలతో పర్యవేక్షణ ♦ 24 గంటలపాటు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ టీం ఏర్పాటు ♦ బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 800 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ♦ ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీం, ఒక సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రిషన్లతో మూడు విడతల వారీగా అందుబాటులో ఉంటారు. ♦ సుమారు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు చేశామని, 310 అత్యంత సున్నిత, మరో 605 సున్నిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ♦ 410 మొబైల్ పోలీసు బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. ♦ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 16, ట్యాంక్‌బండ్ వద్ద 25, మినిస్టర్ రోడ్డులో 3, రాజన్నబౌలి వద్ద 3, మీరాలంట్యాంక్‌లో 2, ఎర్రకుంటలో 2 క్రేన్లను సిద్దం చశారు. ♦ అనేకచోట్ల అంబులెన్స్‌లు, జనరేటర్లు, వైద్యబందాలు, మెకానిక్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ♦ నిమజ్జనం జరిగే మార్గాలలో 117 పాయింట్లను గుర్తించి దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు పనులను చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ♦ భక్తులకోసం ఆర్టీసి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 16 మార్గాల గుండా ట్యాంక్‌బండ్‌కు 500 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ లో గణపతి శోభాయాత్ర
-
ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర..