Khairatabad Ganesh Immersion Updates: ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఖైరతాబాద్‌ గణేషుని ఊరేగింపు సందడిగా కొనసాగుతోంది. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్‌ పనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గంగ ఒడికి చేరనుంది. - Sakshi
Sakshi News home page

ముగిసిన బడా గణేష్‌ శోభాయత్ర.. గంగను చేరిన గౌరీ తనయుడు

Published Sun, Sep 19 2021 9:47 AM | Last Updated on Sun, Sep 19 2021 5:31 PM

Hyderabad: khairatabad Ganesh Shobha Yatra Begin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ బడా గణేషుని శోభాయాత్ర ముగిసింది. 9 రోజులపాటు పూజలందుకున్న పంచముఖ మహా రుద్ర గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌పైకి తరలించారు. శోభాయాత్రలో పాల్గొని భక్త జన సందోహం పులకించి పోయింది. బొజ్జ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 

ప్రత్యేక పూజల అనంతరం 40 అడుగుల ఎత్తు.. 28 టన్నుల బరువున్న గణ నాథుని విగ్రహం గంగమ్మ ఒడికి చేరింది. ఉదయం 7 గంటలకు మొదలైన 2.5 కిలోమీటర్ల శోభాయత్ర దాదాపు 8 గంటలపాటు కొనసాగింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
చదవండి: Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే  

గంగమ్మ ఒడికి గణనాథుడు

సాయంత్రం 3.20 గంటలు
ఖైరతాబాద్‌ పంచముఖ మహా రుద్ర గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. క్రేన్‌ నెంబర్‌ 4 నుంచి గౌరీ తనయుని విగ్రహాన్ని నిర్వాహకుల సమక్షంలో నిమజ్జనం చేశారు.

మధ్యాహ్నం 1.50 గంటలు
► ఖైరతాబాద్‌ మహాగణపతి ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి చేరుకుంది. కాసేపట్లో క్రేన్‌ నెంబర్‌ 4లో మహా గణపయ్య నిమజ్జనం
మధ్యాహ్నం 12 గంటలు
► ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌ వద్దకు చేరుకుంది.

 ఉదయం 10.00 గంటలు
► ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకున్న మహాగణపతి

► టెలిఫోన్ భవన్ చేరుకోవడానికి ఇంకా గంటన్నర పట్టే అవకాశం

► పోలీసులు తొందరపెడుతున్నా.. నెమ్మదిగా వెళ్తామంటున్న ఉత్సవ సమితి

గణేష్ నిమజ్జనంపై డీజీపీ మహేందర్‌ రెడ్డి సమీక్షా నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షిస్తున్నారు.  హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు కలగుండా ప్రశాంతంగా నిమజ్జనం జరగాలని అధికారులకు డిజీపీ అదేశాలు జారీచేశారు.

గణేష్‌ నిమజ్జనం: హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సేవలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement