Khairatabad Ganesha immersion
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
ముగిసిన బడా గణేష్ శోభాయత్ర.. గంగను చేరిన గౌరీ తనయుడు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేషుని శోభాయాత్ర ముగిసింది. 9 రోజులపాటు పూజలందుకున్న పంచముఖ మహా రుద్ర గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌పైకి తరలించారు. శోభాయాత్రలో పాల్గొని భక్త జన సందోహం పులకించి పోయింది. బొజ్జ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం 40 అడుగుల ఎత్తు.. 28 టన్నుల బరువున్న గణ నాథుని విగ్రహం గంగమ్మ ఒడికి చేరింది. ఉదయం 7 గంటలకు మొదలైన 2.5 కిలోమీటర్ల శోభాయత్ర దాదాపు 8 గంటలపాటు కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. చదవండి: Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే గంగమ్మ ఒడికి గణనాథుడు సాయంత్రం 3.20 గంటలు ► ఖైరతాబాద్ పంచముఖ మహా రుద్ర గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. క్రేన్ నెంబర్ 4 నుంచి గౌరీ తనయుని విగ్రహాన్ని నిర్వాహకుల సమక్షంలో నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 1.50 గంటలు ► ఖైరతాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్‌లోకి చేరుకుంది. కాసేపట్లో క్రేన్ నెంబర్ 4లో మహా గణపయ్య నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటలు ► ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. ఉదయం 10.00 గంటలు ► ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకున్న మహాగణపతి ► టెలిఫోన్ భవన్ చేరుకోవడానికి ఇంకా గంటన్నర పట్టే అవకాశం ► పోలీసులు తొందరపెడుతున్నా.. నెమ్మదిగా వెళ్తామంటున్న ఉత్సవ సమితి గణేష్ నిమజ్జనంపై డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు కలగుండా ప్రశాంతంగా నిమజ్జనం జరగాలని అధికారులకు డిజీపీ అదేశాలు జారీచేశారు. గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు -
గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆదివారం గణేష్ నిమజ్జనం దృష్టా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. రేపు అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లు మరోవైపు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఎలాంటి సమస్య తలెత్తకుండా భారీ క్రేన్స్‌తో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లను ఉంచారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చదవండి: Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం 2.5 కిలోమీటర్ల పొడవునా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సాగనుంది. క్రేన్ నెంబర్ 4లో ఖైరతాబాద్ మహాగణపతి నిమ్మజనం జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. చదవండి: రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి ట్రాఫిక్ అదనపు సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా జరిగేందుకు ట్రాఫిక్ విభాగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. క్రేన్లు క్విక్ రిలీజ్ పద్దతిలో విగ్రహాలు నిమజ్జనం చేస్తాయని, దీని వల్ల విగ్రహాల నిమజ్జనం తొందరగా అవుతుందన్నారు. ప్రతిచోట సైన్ బోర్డ్‌లు ఏర్పాటు చేశామని, ఫ్లై ఓవర్ నిర్మాణాల వల్ల కొన్ని చోట్ల శోభాయాత్ర దారి మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. ఫలక్‌నుమా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల ప్రత్యామ్నయ దారిలో శోభాయాత్ర దారి మళ్లించామని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పెద్ద విగ్రహాల వెంట 8 మంది భక్తులు, చిన్న విగ్రహాల వెంట నలుగురు మాత్రమే రావాలని కోరారు. 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు. -
సందడిగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం
-
నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. నిమజ్జనానికి 15వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు సాగుతున్నాయిని పేర్కొన్నారు. (నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు) సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే బాలాపూర్ గణేషుడు నిమజ్జనం అయ్యాడు, మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనం అయిపోతుందని చెప్పారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.ఈ రోజు అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవ సమితి నాయకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. -
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
-
రేపే మహాయాత్ర
గ్రేటర్ నగరం ఆధ్యాత్మిక సాగరమైంది. వీధివీధినా విభిన్న రూపాల్లో వినాయకుడిని కొలువుదీర్చిన జనం తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పూజలు... భజనలు... సాంస్కృతిక కార్యక్రమాలతో గణేశుని మండపాల పరిసరాల్లో సందడి నెలకొంది. శనివారం నాటికి తొమ్మిది రోజులు పూర్తి కావడంతో భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనం చేశారు. మేళతాళాలు.. డప్పుల దరువులు.. విచిత్ర వేషధారణలతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువుల్లో గణేశ నిమజ్జనం పూర్తి చేశారు. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాగణపతి కొలువైన ఖైరతాబాద్ పుణ్యక్షేత్రాలను తలపించింది. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది విశ్వరూప మహాగణపతిని దర్శించుకున్నారు. ఒక్క శనివారమే 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. నిమజ్జనానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఆదివారం సుమారు 3-4 లక్షల మంది ఖైరతాబాద్‌కు తరలి రానున్నారని అంచనా. మరోవైపు సోమవారం మహా గణపతితో పాటు సామూహిక నిమజ్జనానికి విగ్రహాలను తరలించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ఉత్సవ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇలా.. 30 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 800 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. 605 సమస్యాత్మక ప్రాంతాలుగా, 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 410 మొబైల్ పార్టీలు ముందుజాగ్రత్త చర్యగా 30 బాంబ్ డిస్పోజబుల్ బృందాలను ఏర్పాటు చేశారు. మండపాల నుంచి విగ్రహాలను లారీల్లోకి ఎక్కించేందుకు 71 మొబైల్ క్రేన్లను వినియోగిస్తున్నారు. రద్దీ ప్రాంతాలైన రైల్వే, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌తోపాటు వాహనాల తనిఖీలను నిమజ్జనం పూర్తయ్యే వరకు చేపడతారు. నగరానికి చేరుకున్న విశాఖపట్నం నేవీకి చెందిన గజ ఈతగాళ్లు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిపి గత నెల 28 నుంచి చార్మినార్ వద్ద గల సర్దార్మహల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కొనసాగిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌తోపాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై ఉన్న గాంధీనగర్ ఔట్‌పోస్టు వద్ద పోలీసు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా జనం వచ్చే అవకాశం. నగరంలో మొత్తం 23 వేల గణేశ్ విగ్రహాలను నెలకోల్పారు. మూడు, ఐదు, ఏడో రోజుల్లో పలు విగ్రహాలను నిమజ్జనం చేయగా సామూహిక నిమజ్జనానికి మరో ఏడు వేల వరకు మిగిలి ఉన్నాయి. సైబరాబాద్‌లో.. 9,400 మందితో బందోబస్తు ఇందులో ఏడుగురు డీసీపీలు, 25 మంది ఏసీపీలు, 90 మంది సీఐలు, 490 మంది ఎస్ఐలు ఉన్నారు. బాంబ్ స్వ్కాడ్స్ 109 చోట్ల వాహనాల తనిఖీలు 312 చోట్ల పికెట్స్, 112 మొబైల్ పార్టీలు 57 పిక్ యాక్షన్ టీమ్‌లు 51 క్రైమ్ కంట్రోల్ టీమ్‌లు 30 ప్లటూన్ల స్పెషల్ పోలీస్