సుప్రీంలో కేసు తేలేవరకు విద్యార్థులకు అండగా ఉంటాం
తెలంగాణేతరులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు
కల్పించేలా కాంగ్రెస్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల విషయంలో విద్యార్థుల కోరిక మేరకు బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, జీఓ 29పై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ‘మేము లేవనెత్తిన ఏ అంశాన్నీ సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు. జీఓ 29పై తీర్పు వచ్చేంత వరకు ఫలితాలు ఇవ్వవద్దని ఆదేశించడంతో పాటు వేగంగా విచారణ జరపాలని కోరింది. కోర్టు కేసు తేలేదాకా మేము విద్యార్థులకు అండగా ఉంటాం..’అని స్పష్టం చేశారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, కోవాలక్షి్మ, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, గ్యాదరి కిశోర్, నరేందర్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణేతరులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. జీవో 29 విషయంలోనే కాదు,ం జీవో 48, గ్రూప్ 4 ఉద్యోగుల విషయంలో కూడా కోర్టులో పోరాడతాం.’అని తెలిపారు.
రేవంత్‌రెడ్డికి సంజయ్ రహస్య మిత్రుడు
‘విదేశీ పర్యటనకు వెళ్లిన జర్నలిస్టులను అవమానించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే. కళ్ల ముందే మూసీ పేరిట జరుగుతున్న కుంభకోణాన్ని ప్రశి్నస్తున్నాం. మూసీ పేరిట లూటీని మరుగు పరిచేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రహస్య స్నేహం కొనసాగుతోంది. రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడుతున్నాడు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు, కర్ణాటకలో వాలీ్మకి స్కామ్, అమృత్ కుంభకోణంలో సీఎం బావమరిదికి కాంట్రాక్టు తదితరాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు..’అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment