భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మూలమూర్తులు కొలువై ఉండే విమాన గోపురానికి రూ.7కోట్లతో బంగారు తాప డం చేయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ముందుకొచ్చారు. దీనికోసం తనకు అను మతివ్వాలని కోరుతూ ఆలయ ఉన్నతాధికారులకు శనివారం లేఖ అందజేశారు. ఆ లేఖను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపించి, అనుమతి రాగానే పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే బెంగళూరుకు చెందిన భక్తులు స్వామి వారి మూలమూర్తులకు స్వర్ణ కవచాలు సమర్పించగా, ప్రతి శుక్రవారం వాటిని స్వామివారికి ధరింపజేస్తున్నారు. చెన్నైకి చెందిన మరో దాత అంతరాలయంలో బంగారు వాకిలి ఏర్పాటు చేశారు. ఇప్పుడు విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తే రామాయలం బంగారు ధగధగలతో మెరియనుంది.
యాదాద్రీశుడికి బంగారు శేషతల్పం బహూకరణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైదరాబాద్‌లోని సైనిక్‌పురికి చెందిన పుట్టకోట జ్ఞానేశ్వర్‌రావు బృందం బంగారు శయనోత్సవ శేషతల్ప (ఊయల) మండపాన్ని బహూకరించింది. దాత జ్ఞానేశ్వర్ తయారు చేయించిన బంగారు శేషతల్ప మండపాన్ని శనివారం ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మహా మండపంలో బంగారు శేషతల్పానికి ఆలయ ఆచార్యులు ఆగమశాస్త్ర ప్రకారం పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment