
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అభివృద్ధి ప్రణాళిక అందజేస్తున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన గవర్నర్ కేంద్రమంత్రిని కలిసి తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను సమర్పించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ భవిష్యత్తుకు తార్కాణంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్‌ను అభినందించారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు గవర్నర్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment