యువతిపై జిమ్ ట్రైనర్ దాష్టీకం
బాధితురాలి ఫిర్యాదు నిందితుడి అరెస్ట్
బంజారాహిల్స్: ప్రియురాలిపై అనుమానంతో ఆమెను పార్కుకు పిలిచి బూతులు తిట్టి..బూటు కాలితో పొత్తి కడుపులో తన్నిన జిమ్ ట్రైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..వైజాగ్‌కు చెందిన కుమొరల్లు ప్రసాద్ జూబ్లీహిల్స్ ఐలాం కాలనీలో జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ ట్రైనర్‌గా పలువురు యువతులను లోబరచుకుని వారిని మోసం చేస్తున్నాడు.
ఇదే తరహాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రేమ పేరుతో దగ్గరకు తీసి ఆమెతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. కొద్ది రోజులుగా ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న అతను మాట్లాడుకుందామని జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని పార్కుకు రప్పించాడు. అప్పటికే మద్యం మత్తులో తూలుతున్న ప్రసాద్ ఆమె వచ్చీ రావడంతోనే జట్టు పట్టుకుని నేలకొసి కొట్టాడు. పొత్తి కడుపుతో బూటు కాలితో తన్నాడు. అసభ్యంగా ఆమెను దూషిస్తూ చితక బాదాడు.
భయంతో వణికిపోయిన బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె అక్కడికి వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నించగా ఆమెను కూడా దూషిస్తూ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment