సమావేశంలో మాట్లాడుతున్న సంపత్
భీమదేవరపల్లి: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇల్లు అమ్మి మరీ చెల్లించా మని హనుమకొండ జిల్లా భీమదేవ రపల్లి మండలం కొత్తకొండ సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పల్లెప్రగతి’ లో భాగంగా కొత్తకొండలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్‌కుమార్ హాజరయ్యారు.
సమావేశం ప్రారంభం కాగానే సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం బాగుందని, కానీ చేసిన పనులకు బిల్లులు రావడం ఆసల్యం అవుతుండటంతో సర్పంచ్‌లు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం గ్రామంలో 500 ఇంకుడు గుంతలు నిర్మించామని, వాటికి రూ.20 లక్షలకు గాను రూ.5 లక్షలే వచ్చాయని, మిగతా రూ.15 లక్షలు ఇంకా రాలేదని వాపోయారు.
చివరికి తన ఇల్లును రూ.20 లక్షలకు అమ్మి, అప్పులు కట్టి కిరాయి ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు. గ్రామంలో నీటిఎద్దడి నివారించేందుకు 6 బోర్లు వేశామని, నెలకు రూ.లక్ష వరకు వస్తున్న కరెంటు బిల్లు కూడా పంచాయతీకి భారంగా మారిందని చెప్పా రు. జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్క రి స్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ. 2లక్షలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment